Dabbawala: మూడుపూట్లా రూ.600కే ఫుడ్ డోర్ డెలివరీ.. ఏం జరిగిందంటే?

Dabbawala: టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో చాలా వరకు స్త్రీలు పురుషులు యువత అందరూ ఎక్కువగా ఆన్లైన్ కల్చర్ కీ అలవాటు పడిపోయారు. మరీ ముఖ్యంగా స్త్రీ పురుషులు ఉద్యోగం చేసేవారు అయితే ఫుడ్ చేసుకోవడానికి ఆలస్యం అవుతుంది అని వెంటనే ఆన్లైన్ యాప్స్ లో ఫుడ్ ని ఆర్డర్ చేసుకొని తింటూ ఉంటారు. ఈ ఫుడ్ ఆర్డర్ ని డెలివరీ చేసే యాప్లు ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతూనే ఉన్నాయి. గెస్ట్ లో వచ్చినప్పుడు అలాగే ఏదైనా చేసుకొని తినాలి అనిపించినప్పుడు ఎక్కువగా శ్రమ పడకుండా మొబైల్ ఫోన్లో ఆర్డర్ చేయడం ఒక పావు గంటలో ఫుడ్ ఇంటికి వస్తుంది. దీంతో ఈ కల్చర్ కి చాలామంది బాగా అలవాటు పడిపోయారు.

 

ఇటువంటిదే ఈ డబ్బావాలా కూడా. అసలు ఈ డబ్బావాలా అంటే ఏమిటి దీని ప్రత్యేకం ఏమిటి అన్న విషయాల్లోకి వెళితే.. సిటీలలో ఉన్నవారు బిజీ బిజీ షెడ్యూల్ వల్ల భర్త సమయానికి వండి పెట్టేందుకు అలాగే పిల్లలకు స్కూలుకు పంపేందుకు సరైన సమయం లేకపోవడంతో చాలామంది ఈ డబ్బావాలా అనే సౌకర్యానికి అలవాటు పడిపోయారు. ముఖ్యంగా ముంబైలో ఈ డబ్బావాలా సంస్కృతిని ఎక్కువగా చూడవచ్చు. ఉదయం హడావుడిగా స్కూళ్లు, ఆఫీసులకు వెళ్లిన వారికి వేడివేడిగా ప్యాక్ చేసిన లంచ్ బాక్స్​ను అందించడమే డబ్బావాలాల పని. ముంబైలోని లోకల్ ట్రైన్స్, ఆటో రిక్షాల సాయంతో డబ్బావాలాలు ప్రయాణిస్తూ నిర్ణీత సమాయానికి వేడివేడి లంచ్ బాక్సులను అందించి మంచి పేరు తెచ్చుకుంది డబ్బువాలా.

కాగా ఈ డబ్బావాలాల కల్చర్ ముంబై నుంచి దేశంలోని ప్రధాన నగరాలన్నింటికీ విస్తరించింది. ఇప్పుడు ప్రధాన నగరాల నుంచి పట్టణాల్లోకి డబ్బావాలాల సంస్కృతి వచ్చేసింది. తెలంగాణలోనూ ఈ కల్చర్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. తాజాగా కరీంనగర్​లో డబ్బావాలా సర్వీసులు మొదలయ్యాయి. లంచ్ టైమ్​కు 45 నిమిషాల ముందు బాక్స్‌లను తీసుకుని గమ్యస్థానాలకు తీసుకెళ్లి ఎంప్లాయీస్, స్టూడెంట్స్​కు అందిస్తున్నారు. తద్వారా కస్టమర్లు వేడివేడిగా రుచికరమైన ఆహారాన్ని తింటూ ఆనందిస్తున్నారు. సహస్ర అనే డబ్బావాలా సంస్థ అయితే ఇలా కస్టమర్ల నుంచి భోజనాన్ని పిక్ చేసుకుని గమ్యస్థానాలకు చేర్చడమే గాక తమ కిచెన్​లో ప్రత్యేకంగా భోజనాలను ప్రిపేర్ చేస్తూ ఉద్యోగులు, విద్యార్థులకు అందిస్తోంది.

 

స్కూల్ పిల్లలకు ఇబ్బంది అవుతోందనే ఉద్దేశంతోనే ఈ సహస్ర అనే డబ్బావాలా స్టార్టప్​ను మొదలు పెట్టినట్లు తెలిపారు మహేందర్. పిల్లలకు వేడివేడి భోజనాన్ని అందించాలనే సంకల్పంతో డబ్బావాలాను ప్రారంభించామని ఆయన అన్నారు. ప్రతి రోజూ ఉదయం 11.30 గంటలకు పేరెంట్స్ ఇంటి నుంచి బాక్సులను తీసుకుని లంచ్ బ్రేక్ సమయానికి పిల్లలకు అందిస్తామని మహేందర్ తెలిపారు. అయితే తమ దగ్గర నలుగురు డెలివరీ బాయ్స్ పని చేస్తున్నారని 50 ఆర్డర్లు వరకు ఉన్నాయని మహేందర్ చెప్పుకొచ్చారు. రీసెంట్​గా సొంత కిచెన్ తెరిచామని ఆర్డర్ చేసిన ఉద్యోగులకు ఇంటి భోజనం తరహాలో వండిన రుచికరమైన ఫుడ్​ను ఆఫీసులకు వెళ్లి డెలివరీ చేస్తున్నామని తెలిపారు. తమ కిచెన్ నుంచి తీసుకెళ్లే భోజనానికి సంబంధించి ఉద్యోగులకు నెలకు రూ.2,300 ఛార్జ్ చేస్తున్నామని, అదే పిల్లలకు అయితే రూ.1,500 తీసుకుంటున్నామని వివరించారు. అదే పిల్లల ఫుడ్​ను వారి ఇంటి నుంచి పికప్ చేసుకునేందుకు 3 కిలోమీటర్ల లోపు దూరానికి నెలకు రూ.600 తీసుకుంటున్నామని మహేందర్‌‌ చెప్పారు. ఆ తర్వాత దూరానికి తగ్గట్లు ధరలు కాస్త పెరుగుతాయన్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -