Bike Taxi: బైక్ ట్యాక్సీ బుకింగ్ చేసుకునే వాళ్లకు షాక్.. ఇలాంటి వెధవలు ఉంటారంటూ?

Bike Taxi: ఇటీవల కాలంలో ఆన్లైన్ బుకింగ్ వాహనాలకు చాలా డిమాండ్ ఏర్పడింది.ప్రతి ఒక్కరూ వారి అవసరాల నిమిత్తం ఇలా ఆన్లైన్ ద్వారా వాహనాలను బుక్ చేసుకొని వారి కార్యకలాపాలను పూర్తి చేసుకుంటున్నారు. అయితే ఇలా ఆన్లైన్ బుకింగ్ వాహనాల ద్వారా జాగ్రత్తగా ఉండమని ఓ మహిళ తణుకు జరిగిన చేదు సంఘటన గురించి చెబుతూ అందరికీ జాగ్రత్తలు చెప్పారు.

బెంగళూరుకి చెందిన ఓ మహిళ తన మీటింగ్ పూర్తి కావడంతో ఇంటికి వెళ్లడానికి ఓ కంపెనీకి చెందిన బైక్ బుక్ చేసుకున్నారు. అయితే ఆ వ్యక్తి కంపెనీకి చెందిన బైక్ నుంచి కాకుండా వేరే బైక్ నుంచి లొకేషన్ కి చేరుకొని తనని పికప్ చేసుకుని వెళ్లారని తెలిపారు.అయితే కొంత దూరం వెళ్ళగానే ఎవరూ లేనటువంటి ప్లేస్ లో తాను ఒక చేతితో బైక్ నడుపుతూ మరొక చేతితో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆమె తెలిపారు.

 

ఇక తాను ఇంటి వరకు బైక్ బుక్ చేసుకున్నప్పటికీ తాను 200 మీటర్ల దూరంలోనే తనని దింపి వెళ్లారని మహిళా వెల్లడించారు.ఇకపోతే ఆ వ్యక్తి తన ఫోన్ నెంబర్ సేవ్ చేసుకొని తనకు అసభ్యకరమైన మెసేజ్లు పెడుతున్నారని అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా ఆ మహిళ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇలా ఆ వ్యక్తి అసభ్యంగా మెసేజ్లు పెట్టడంతో తాను బ్లాక్ చేసానని తెలిపారు.

 

ఈ విధంగా ఆ వ్యక్తి తనని వివిధ రకాల ఫోన్ నెంబర్ల నుంచి ఇప్పటికి విసిగిస్తూనే ఉన్నాడని అయితే ప్రయాణికుల సురక్షిత ప్రయాణం కోసం సదరు కంపెనీలు జాగ్రత్తలు తీసుకోవాలనీ కూడా ఈమె హితువు పలికారు.అలాగే ఇకపై ఇలాంటి వాహనాలను బుక్ చేసుకునే సమయంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త తీసుకోవాలని ఈ మహిళ తెలియచేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -