Gwalior: బైక్ వల్ల ఆగిన పెళ్లి.. ఆ ఎమ్మెల్యే చేసిన పనికి షాకవ్వాల్సిందే!

Gwalior: వివాహ వ్యవస్థల్లో ఇప్పటికీ కట్న కానుకల పద్ధతి నడుస్తూనే ఉంది. రేంజ్ ని బట్టి పెళ్లి కొడుకుని, అమ్మాయి వారు కొనుగోలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో కొన్న ప్రాంతాల్లో అబ్బాయిలకు కాస్తంత డిమాండ్ పెరిగింది. ఆ క్రమంలోనే కోరికలు కూడా పెరిగాయి. కారు, బైకు, ప్లాట్లు ఇలా రకరకాల కోరికలు కోరుతున్నారు. తాజా పీటల మీద పెళ్లి జరుగుతున్న తరుణంలో ఓ వరుడు చేసిన పనికి అక్కడుతున్న వారంతా షాక్ అయ్యారు.

కాసేట్లో పెళ్లి జరుగుతుందనగా పెళ్లి పీటల మీదనే పెళ్లి కొడుకు ఓ డిమాండ్ పెట్టాడు. ఆ డిమాండ్ ఏంటంటే బైక్. బైక్ కొనివ్వలేదని పెళ్లి కొడుకు అలిగాడు. పెళ్లి చేసుకోను అని మొండికేశాడు. దాంతో వధువు తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు గురయ్యారు. చివరి క్షణంలో ఇలా జరిగిందేంటని తీవ్రంగా కంగారుపడ్డారు. ఇక ఈ పెళ్లి జరగదని అంతా అనుకున్నారు. కానీ అక్కడి వచ్చిన ఎమ్మెల్యే రసమయి ఆ పెళ్లి జరిగేలా చేశారు.

 

పెళ్లికి అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తన గొప్ప మనసు చాటుకున్నారు. పెళ్లి ఆగకుండా జరిగేలా చేశారు. బైక్ కొనిస్తేనే తాళి కడతానని, లేదంటే పెళ్లి చేసుకోకుండా వెళ్లిపోతానని పెళ్లికొడుకు పట్టుపట్టాడు. అదే సమయంలో ఆ వివాహానికి గెస్ట్ గా వచ్చిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పెళ్లి కొడుక్కి నచ్చ చెప్పారు. బైక్ కి కావాల్సిన డబ్బు కూడా ఇచ్చారు.

 

పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోతుందని, పెళ్లి కూతురు కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతం అయ్యారు. ఈ బాధాకరమైన సంఘటనను కళ్లారా చూసిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చలించిపోయారు. వెంటనే పెళ్లికొడుకుతో మాట్లాడారు. తాను బైక్ కొనిస్తానని చెప్పారు. మాట ఇవ్వడమే కాదు లక్ష రూపాయల నగదును పెళ్లి కానుకగా ఇచ్చారు. దీంతో పెళ్లికుమారుడు వివాహానికి అంగీకరించాడు. పెళ్లికూతురు మెడలో తాళి కట్టాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -