Charmy: శ్రీ ఆంజనేయం ఫ్లాప్ కావడానికి ఆ లెక్క ప్రకారం ఛార్మి కారణమా?

Charmy: ఇటీవల హనుమాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనాలను సృష్టిస్తున్న సంగతి మనకు తెలిసిందే. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటించినటువంటి హనుమాన్ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదల అయ్యి నేటికి సరిగా నెల రోజులు అవుతుంది. ఇలా 30 రోజులలో 300 సెంటర్లలో ఈ సినిమా విజయవంతంగా ప్రసారమైంది.

 

ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ అధికారిక పోస్టర్ వెల్లడించారు. ఇదిలా ఉండగా హనుమాన్ సినిమా ప్రసారమవుతున్నటువంటి తరుణంలో చాలామంది శ్రీ ఆంజనేయం సినిమాని గుర్తు చేసుకున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో చార్మి నితిన్ హీరో హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాగున్నప్పటికీ కొన్ని కారణాలవల్ల అప్పట్లో ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది.

ఇక ఈ విషయం గురించి కొంతమంది నేటిజన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటూ కృష్ణవంశీ ట్విట్టర్ అకౌంట్ ట్యాగ్ చేశారు. హనుమాన్ సినిమా కంటే శ్రీ ఆంజనేయం సినిమా చాలా బాగుంది కానీ ఈ సినిమా ప్రేక్షకులకు ఎందుకు నచ్చలేదు అంటూ కామెంట్ చేశారు. ఈ కామెంట్లపై కృష్ణవంశీ స్పందిస్తూ ప్లీజ్ ప్రేక్షకులను మాత్రం నిందించకండి. వారి నిర్ణయం ఎప్పటికీ తప్పు కాదు.

 

 

శ్రీ ఆంజనేయం సినిమా విషయంలో ఎక్కడో తప్పు జరిగింది కొన్ని కారణాలవల్ల ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయిందని తెలిపారు. ఇంతలోనే ఒక నెటిజన్ ఈ సినిమా ఫ్లాప్ అవ్వటానికి చార్మినేని కారణమని ఈమె పాత్ర ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసేలాగా లేదని కామెంట్ చేశారు. ఈ కామెంట్లపై కృష్ణవంశీ స్పందిస్తూ గాడ్ బ్లెస్స్ యు అంటూ రిప్లై ఇచ్చారు. ఒక భక్తి భావంతో కూడినటువంటి సినిమాలో ఛార్మి పాత్ర కాస్త ఎక్స్పోజింగ్ చేసేలాగా ఉంది దీంతో ఈ సినిమా ఫ్లాప్ అయిందని అప్పట్లో చర్చలు కూడా వచ్చాయి. తాజాగా ఈ సినిమా గురించి నేటిజన్స్ చర్చలు జరుపుకున్న తరుణంలో కృష్ణవంశీ స్పందించడం ఆయన రిప్లై ఇచ్చినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -