Actor Aadi: ఆ సినిమా ప్లాప్ అవ్వగానే ఐదు నెలలు ఎవ్వరితో మాట్లాడలేదంటున్న ఆది!

Actor Aadi: టాలీవుడ్ ప్రేక్షకులకు సాయికుమార్ కొడుకు ఆది గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రేమ కావాలి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఆది.. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాతో ఆది ఒక మంచి యువ నటుడుగా కూడా గుర్తింపు సంపాదించుకున్నాడు. అనంతరం ఆది లవ్లీ అనే సినిమాలో నడిచాడు.

ఈ సినిమాతో కూడా ఆది ప్రేక్షకుల, విమర్శకులకు ప్రశంసల వర్షం కురిపించుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాలో నటించి నటుడుగా తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఆది సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు. ఎప్పటికప్పుడు తన సినిమా స్టోరీలకు సంబంధించిన అప్ డేట్స్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అది కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశాడు.

ఓ మీడియాలో ఇంటర్వ్యూ ఇచ్చిన ఆది నెక్స్ట్ మూవీ సక్సెస్ కాకపోవడాన్ని నేను భరించలేకపోయాను అని తెలిపాడు. అంతేకాకుండా నాకు ఆ సమయంలో ఏం చేయాలో తోచ్చేది కాదు. దాదాపు 5, 6 నెలల వరకు నేను ఎవరితో మాట్లాడలేదు అని తెలిపాడు. ఇక ఆ సమయంలో నాకు నా భార్య బాగా తోడుగా ఉండి నాకు ధైర్యం చెప్పేది అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక అది రాబోయే సినిమాల విషయానికొస్తే కిరాతక అనే సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా మెప్పించబోతుంది. కాగా ఈ సినిమా నవంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు వీరభద్రం దర్శకత్వం వహిస్తున్నాడు. అదేవిధంగా ఆది జంగల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడట. ఈ సినిమాకు విగ్నేష్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడట. ఈ సినిమా సెప్టెంబర్ 27న థియేటర్లోకి విడుదల చేస్తారన్నట్లు తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -