Hyper Aadi: బుల్లితెర కార్యక్రమాల ద్వారా భారీగా ఆస్తులు కూడా పెట్టిన హైపర్ ఆది?

Hyper Aadi:  బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా ఎంతోమంది కొనసాగుతున్నారు.ఈ క్రమంలోని బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు హైపర్ ఆది. ఇలా జబర్దస్త్ కార్యక్రమంతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో అనంతరం శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి కార్యక్రమాలలో కూడా చేస్తున్నారు.

ఈ విధంగా బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హైపర్ ఆది పెద్ద ఎత్తున రెమ్యూనరేషన్ తీసుకుని భారీగా ఆస్తులను కూడా పెట్టినట్లు తెలుస్తుంది.హైపర్ ఆది ఇండస్ట్రీకి రాకముందు కేవలం తనకు ఒక సొంత ఇల్లు ఉంది. అది కూడా చాలా చిన్న ఇల్లు మాత్రమే ఉండేదట అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తన టాలెంట్ తో అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఈయన సుమారు 50 కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టినట్లు తెలుస్తోంది.ఇకపోతే హైదరాబాద్ లో ఈ మధ్యకాలంలో హైపర్ ఆది కొనుగోలు చేసిన ఇల్లు సుమారు 10 కోట్ల వరకు ఖరీదు చేస్తుందని సమాచారం. ఇలా ఇల్లు మాత్రమే కాకుండా ఖరీదైన కార్లు కూడా కొనుగోలు చేశారట. ఇక తన సొంత గ్రామంలో కూడా పెద్ద ఎత్తున పొలం కొనుగోలు చేశారని తెలుస్తుంది.

ఈ విధంగా హైపర్ ఆది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏకంగా 50 కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టినట్టు సమాచారం. అయితే హైపర్ ఆది బుల్లితెర కార్యక్రమాల ద్వారా సంపాదించుకున్న క్రేజ్ కారణంగా ఈయన సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటున్నారు. ఇలా ఒక వైపు సినిమాలలో మరోవైపు బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తూ భారీగా ఆస్తులను కూడబెట్టినట్టు తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -