Actor Brahmaji: నెటిజన్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బ్రహ్మజీ వైరల్ అవుతున్న పోస్ట్?

Actor Brahmaji: విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా విడుదలైన అనంతరం ప్లాప్ టాక్ సొంతం చేసుకోవడంతో అనసూయ పరోక్షంగా విజయ్ దేవరకొండను టార్గెట్ చేసి అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. దాని ఫలితం ఇప్పుడు రాకపోయినా మరి కాస్త ఆలస్యంగా వస్తుంది అంటూ చేసిన ట్వీట్ వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలోనే ఈ విషయంపై విజయ్ దేవరకొండ అభిమానులు అనసూయ మధ్య గత వారం రోజుల నుంచి ట్వీట్ వార్ జరుగుతుంది.

అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలపై కొందరు నెటిజెన్లు స్పందిస్తూ ఏకంగా ఆమెను ఆంటీ అంటూ ట్రోల్ చేశారు. ఇలా తనని ఆంటీ అనడంతో మండిపడిన అనసూయ తనని ఏజ్ షేమింగ్ చేస్తున్నారని తనని ఆంటీ అన్న వారిపై కేసు వేస్తానంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఇలా అనసూయ ఆంటీ వివాదంపై పెద్ద ఎత్తున మండిపడడంతో కొందరు నెటిజెన్ లు నటుడు బ్రహ్మాజీని సైతం అంకుల్ అంటూ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ పై స్పందించిన బ్రహ్మాజీ అంకుల్ ఏంట్రా అంకుల్ ఇలా నన్ను బాడీ, ఏజ్ షేమింగ్ చేస్తే పోలీస్ కేసు వేస్తా అంటూ ఈయన అభిమానులకు సరదాగా కౌంటర్ ఇచ్చారు. అయితే నటుడు బ్రహ్మాజీ పరోక్షంగా అనసూయని ఉద్దేశించి కేసు వేస్తానంటూ కామెంట్ చేశారని తెలుస్తోంది.ఇలా అనసూయ ఇప్పటికే నెటిజన్లపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయగా మరోసారి ఈయన కూడా అంకుల్ అంటే కేసు వేస్తా అంటూ అనసూయని పరోక్షంగా టార్గెట్ చేస్తూ తనని గెలికాడు.

ఏది ఏమైనా బ్రహ్మాజీ మాత్రం అనసూయ వివాదంలోకి ఎంట్రీ ఇస్తూ ఇలా అంకుల్ అంటే కేసు వేస్తానని వార్నింగ్ ఇచ్చారు.ఈ విషయంపై అనసూయ ఇప్పటివరకు మౌనం వహించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.తనని ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరు ఏమైనా అంటే వారిపై ఆగ్రహం వ్యక్తం చేసే అనసూయ అంకుల్ అంటే కేసు వేస్తా అని అన్నప్పటికీ మౌనంగా ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -