Actor Rao Ramesh: రావు రమేష్‌ పర్సనల్‌ మేకప్‌మెన్‌ మృతి.. వారి కుటుంబానికి రమేష్‌ ఎంత సహాయం చేశాడో తెలుసా?

నిమాల్లో విలన్‌ పాత్రాల్లో నటిస్తున్న చాలా మంది నిజజీవితంలో హీరోయిజం చూపిస్తున్నారు. సినిమాల్లో ఇతరులను వేధిస్తుంటున్న వీరు బయట ఎంతో మందికి అక్కున చేర్చుకుంటుంటారు. ఇటీవల ప్రముఖ నటుడు రావు రమేష్‌ పర్సనల్‌ మేకప్‌ మేన్‌ బాబు ఆకస్మికంగా వృతి చెందగా అతని కుటుంబానికి రావు రమేష్‌ అండగా నిలిచాడు. రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించి మంచి మనసు చాటుకున్నారు.

స్వయంగా రావు రమేష్‌ మేకప్‌ మెన్‌ బాబు ఇంటికి వెళ్లి డబ్బులు ఇచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించాడు. ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా తనను సంప్రదించాలని రావు రమేష్‌ బాధిత కుటుంబ సభ్యులకు భరోసా కల్పించాడు. అలనాటి లెజండరీ యాక్టర్‌ రావు గోపాలరావు తనయడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రావు రమేష్‌ తనదైన నటనతో ప్రత్యేకమైన ముద్ర వేశారు.

సీమ సింహం మూవీతో తెరంగేట్రం చేసిన రావు రమేష్‌ ఎన్నో సూపర్‌ హిట్లు కొట్డా. విలన్, తండ్రిగా.. అన్ని విధాలుగా ఆయన ప్రేక్షకులను మెప్పిస్తుంటాడు. తెలుగే కాక తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి అక్కడి ప్రేక్షకులను మనసులో చెరగని ముద్ర వేసుకుంటున్నాడు. ప్రస్తుతం రావు రమేష్‌ చాలా సినిమాలకు సంతకాలు చేయడంతో బిజిబిజిగా మారిపోయాడు.

రావు రమేష్‌ తన మేకప్‌మెన్‌ కుటుంబానికి చేసిన సహాయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఇది మానవతా దృక్పథానికి నిలువెత్తు నిదర్శనమని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఆయన చేసిన మంచి పని వల్ల ఒక కుటుంబానికి ఎంతో సహాయ పడుతుందని మరి కొందరు కామెంట్ల రూపంలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Bobbili Constituency: బొబ్బిలి నియోజకవర్గం టీడీపీ లెక్కలు మార్చబోయే నేతలు వాళ్లేనా.. ఏమైందంటే?

Bobbili Constituency:  గత మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ బొబ్బిలిలో జెండా ఎగరవేయాలని చూస్తోంది కానీ ఎందుకో ఆ నియోజకవర్గం తెలుగుదేశానికి పెద్దగా కలిసి రావటం లేదు. 1983లో నందమూరి తారక రామారావు...
- Advertisement -
- Advertisement -