Thalapathy Vijay: కోట్లు విలువ చేసే ఖరీదైన ఇంటిని కొన్న హీరో విజయ్.. ఖరీదు తెలిస్తే దిమ్మతిరిగి పోవాలంతే?

Thalapathy Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న విజయ్ సౌత్ ఇండస్ట్రీలో.. అధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోలలో ఒకరు. విజయ్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. పేరుకి తమిళనాడు అయినప్పటికీ సౌత్ ఇండస్ట్రీలో అన్ని భాషలలో ఎంతోమంది అభిమానులు ఉన్నారు. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న విజయ్ గురించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

విజయ్ ఒక లగ్జరీ అపార్ట్మెంట్ ని కొనుగోలు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చెన్నైలోని ఒక ఖరీదైన ప్రాంతంలో విజయ్ ఈ అపార్ట్మెంట్ ని కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం దళపతి విజయ్ ఈస్ట్ కోస్ట్ రోడ్ ప్రాంతంలో ఉన్న విలాసవంతమైన ఇంట్లో తన కుటుంబంతో కలసి నివాసముంటున్నాడు. అయితే కొంతకాలంగా ఆ ప్రాంతం రద్దీగా మారడటంతో కొత్త చోటుకు మారాలని విజయ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అందువల్ల ఈ విధమైనటువంటి ట్రాఫిక్ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ హీరో దాదాపు 35 కోట్ల రూపాయలు చెల్లించి కొత్త అపార్ట్మెంట్ ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అడయార్‌లోని పాత ఇంటిని ఆఫీసుగా ఉపయోగించుకుంటున్న విజయ్ తన ఆఫీసుని కొత్తగా కొనుగోలు చేసిన భవనంలోకి తరలించి అడయార్ ఇంటి నుంచి ‘విజయ్ మక్కల్ ఇయ్యకం’ పార్టీ కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

ఇదిలా ఉండగా విజయ్ కొనుగోలు చేసిన భవనంలోనే మరో తమిళ్ స్టార్ హీరో ఆర్య కూడా ఉంటున్నాడు. ఇప్పటికే ఆర్యకు ఈ భవనంలో సొంతంగా ప్లాట్ ఉంది. ఇక దళపతి విజయ్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం.. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న వారసుడు సినిమాలో నటిస్తున్నాడు. మొట్టమొదటిసారిగా ఈ సినిమా ద్వారా విజయ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్నాడు. దిల్ రాజు ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాని తెలుగుతోపాటు తమిళ భాషలో కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటించనున్నాడు.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -