LEO Scam: లియో సినిమాకు విజయ్ పరువు గంగలో కలిసిందిగా.. లియో కలెక్షన్ల లెక్కల్లో నిజం ఇదేనంటూ?

LEO Scam: తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి మనందరికీ తెలిసిందే. విజయ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ తాజాగా లియో సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా నెగటివ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటు విజయ్ కెరిర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమా బుకింగ్ సమయంలో అయితే విజయ్ నటించిన సినిమాలన్నింటిలో ఇదే నెంబర్ వన్ గా నిలుస్తుంది అని అభిమానులు కూడా ఎంతో ఆశపడ్డారు. కానీ అవి ఏమీ జరగలేదు. ఇక తెలుగులో వీకెండ్ తర్వాత లియో సౌండ్ లేదు. తమిళంలో కూడా వసూళ్లు బాగా పడిపోయాయి.

కానీ నిర్మాతలు మాత్రం పోస్టర్ల మీద 300 కోట్లు, 400 కోట్లు అంటూ ఘనంగా వేసుకుంటున్నారు. డివైడ్ టాక్‌తో ఈ వసూళ్లేంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏదో పరువు పోకుండా, ట్రోల్స్ బారిన పడకుండా ఉండడం కోసం ఏదో పోస్టర్ లపై ఫేక్ కలెక్షన్స్ రాస్తున్నారు. లియో మూవీ బుకింగ్స్, కలెక్షన్స్ పెద్ద స్కామ్ అనే విషయాన్ని స్వయంగా థియేటర్ల యజమానులే చెబుతుండటంతో విజయ్ అండ్ టీం పరువు పోతోంది. యుఎస్‌లో లియో రూ.18 మిలియన్ల డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు పోస్టర్ల మీద వేశారు. కానీ అక్కడ డిస్ట్రిబ్యూటర్ ఐదు కోట్ల దాకా ఖర్చు పెట్టుకుని ప్రాక్సీ బుకింగ్స్‌తో ప్రేక్షకుల్లో సినిమాకు క్రేజ్ పెంచడానికి ప్రయత్నించినట్లుగా ఒక స్కామ్ వెలుగులోకి వచ్చింది. మరోవైపు తమిళనాట కూడా ఈ సినిమాకు ఆశించిన వసూళ్లు లేవంటూ థియేటర్ల యజమానులు పలువురు మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

తమిళనాడు థియేటర్ల సంఘం అధ్యక్షుడైన తిరుపూర్ సుబ్రహ్మణ్యం అనే ఎగ్జిబిటర్.. లియో వసూళ్ల లొసుగులను బయటపెడుతూ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. లియో వాస్తవ వసూళ్లకు, నిర్మాతలు ప్రకటిస్తున్న కలెక్షన్లకు పొంతన లేదని అతనన్నాడు. తాను కలెక్షన్ స్కామ్ గురించి బయటపెట్టినందుకు లియో నిర్మాత తనను బెదరించాడని చెప్పాడు. మరో ఎగ్జిబిటర్ లియోకు అసలు నిర్మాత విజయే అని, ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన లలిత్ అతడి ఉద్యోగి అని ఆరోపించాడు. ఈ సినిమాకు థియేటర్లలో తక్కువ వసూళ్లు వస్తున్నట్లు చెప్పాడు. మొత్తంగా చూసుకుంటే ఇవన్నీ వింటుంటే లియో సినిమా పరువు గంగలో కలిసిపోయినట్టు అని చెప్పవచ్చు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -