LEO Movie: భగవంత్ కేసరి, టైగర్ కంటే బుకింగ్స్ లో లియోనే తోపు.. అసలేం జరిగిందంటే?

LEO Movie: విజయ్ తలపతికి తమిళనాడులో విపరీతమైన క్రేజ్ ఉందని తెలుసు కానీ తెలుగు రాష్ట్రాల్లో కూడా విజయ్ కి విపరీతమైన అభిమానులు ఉన్నారని, వారికి లియో ఫీవర్ బాగా ఎక్కువగా ఉందని ఆ సినిమా బుకింగ్స్ స్పష్టం చేస్తున్నాయి. భగవంత్ కేసరి,టైగర్ నాగేశ్వరరావు లాంటి తీవ్రమైన పోటీలు పెట్టుకుని కూడా ఇంత క్రేజ్ తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. అయితే ఈ సినిమాకి ఇంత క్రేజ్ రావడానికి కారణం విజయ్ ఇమేజ్ తో పాటు దర్శకుడు లోకేష్ కనకరాజ్ బ్రాండ్ కూడా యాడ్ అయిందని చెప్పాలి.

స్టైలిష్ యాక్షన్ ఉంటుందని అభిప్రాయం ఆడియన్స్ లో బలంగా ఉండటం వలన ఫస్ట్ డేనే చూసేందుకు ఫ్యాన్స్ ప్రిపేర్ అవుతున్నారు. తమిళనాడులో తొమ్మిది గంటలకు ముందు షోలు పడవు, కానీ సరిహద్దు ప్రాంతాల్లో ఉండే సూళ్లూరుపేట, నగరి చిత్తూరు, నెల్లూరు లాంటి ఊర్లలో తెల్లవారుజామున నాలుగు గంటలకి బెనిఫిట్ షోలు ఏర్పాటు చేస్తారు. కాబట్టి విజయ్ ఫ్యాన్స్ భారీ సంఖ్యలో బార్డర్ ఊళ్ళ మీద పోటెత్తుతారు అని విమర్శకులు భావిస్తున్నారు. లియో ఫీవర్ బెంగళూరులో కూడా పీక్స్ లో ఉంది.

ఒక్క ఐమాక్స్ ప్రీమియర్ టికెట్ 2,500 అధికారికంగా పెట్టిన సరే ఆన్లైన్లో సోల్డ్ అవుట్ బోర్డు వెక్కిరిస్తోంది. బయట రాష్ట్రాల్లోనే ఈ ఫీవర్ ఇలా ఉంటే ఇక చెన్నై పరిస్థితి వేరే చెప్పాలా.. ఈ సినిమా ట్రైలర్ మీద వచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ ని విజయ్ ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. ఈ డబ్బింగ్ సినిమా మిగిలిన రెండు సినిమాలకి గట్టి పోటీ ఇవ్వచ్చు అంటున్నారు. ఎందుకంటే లియో సినిమాను నైజాం లో దిల్ రాజు విడుదల చేస్తున్నారు అలాగే సితార సంస్థతో కలిపి జర్నీ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఆంధ్రాలో విడుదల చేస్తున్నారు.

వీళ్లంతా థియేటర్లు మార్కెటింగ్ విషయంలో ఆరితేరిపోయి ఉన్నారు. దీనివలన ఖచ్చితంగా భగవంత్ కేసరి సినిమాకు థియేటర్ల విషయంలో కాస్త పోటీ తప్పదు. టైగర్ నాగేశ్వరరావు ఈ విషయంలో కాస్త వెనకబడి ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనాప్పటికీ లియో దెబ్బ బాలయ్య బాబు సినిమాపై పడే అవకాశాలు గట్టిగానే ఉన్నాయి అంటున్నారు సినీ వర్గాల వారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -