LEO-Bhagavanth Kesari: నందమూరి అడ్డాలో లియో డామినేషన్.. బాలయ్య బాబు మూవీకి ఇలాంటి పరిస్థితా అంటూ?

LEO-Bhagavanth Kesari: బాలయ్య భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, విజయ్ లియో సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా విడుదల అయ్యాయి. థియేటర్స్ హౌస్ ఫుల్ బోర్డ్స్ కళకళలాడిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో మన టాలీవుడ్ లో ఇలాంటి పండగ వాతావరణం చూసి చాలా రోజులైంది. ఇక సినిమాల విషయానికి వస్తే బాలయ్య సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. లియో చిత్రానికి మాత్రం డివైడ్ టాక్ వస్తుంది.

అడ్వాన్స్ బుకింగ్ తోనే రికార్డుని నెలకొల్పిన ఈ సినిమా మొదటిరోజు ఓవరాల్ గా 100 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లును సాధిస్తుందని అంటున్నారు. అయితే సినిమాపై డివైడ్ టాక్ రావడానికి కారణం మాత్రం రిలీజ్ అవ్వటానికి ముందే విపరీతమైన బజ్ ఏర్పడింది ఈ సినిమాకి. దానివల్ల ప్రేక్షకులు మితిమీరిన అంచనాలు పెట్టుకున్నారు. అయినప్పటికీ ఈ సినిమా తెలుగులో బాలయ్య లాంటి మాస్ హీరో సినిమా ఓపెనింగ్స్ ని కూడా డామినేటింగ్ చేసింది.

బాలయ్య కి కంచుకోటగా చెప్పుకునే ఒంగోలు, కందుకూరు వంటి ప్రాంతాలలో కూడా లియోచిత్రమే లీడింగ్ గా ఉంది. ఇది ట్రేడ్ పండితులకు సైతం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. లియోచిత్రానికి యూత్ ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు.అయితే భగవంత్ కేసరి కంటే తక్కువే ఉండటంతో లాంగ్ టర్న్ లో ఖచ్చితంగా లియో పై లీడింగ్ తీసుకుంటుంది అంటున్నారు ట్రేడ్ పండితులు. మామూలుగా అయితే తెలుగులో విజయ్ సినిమాలకి ఇంత ఓపెనింగ్స్ ఉండవు. అయితే లోకేష్ కనకరాజు డైరెక్షన్ మీద తెలుగు ప్రేక్షకులకు గట్టి నమ్మకం ఉంది.

అంతేకాకుండా ఈ సినిమాని సితార వంటి పెద్ద బ్యానర్ లో వస్తుంది ఈ సినిమా అంతేకాదు లోకేష్ కనకరాజు విక్రమ్ కి, ఖైదీకి తెలుగు ముడి పెట్టాడు. ఇప్పుడు ఆ ప్రపంచంలోకి లియో ని కూడా తీసుకువెళ్ళాడు.మొత్తానికి లియో సినిమాతో పోల్చితే భగవంత్ కేసరి సినిమాకి బుకింగ్స్ తక్కువనే చెప్పాలి. ఇదంతా తళపతి విజయ్ గొప్పతనం అనుకుంటే పొరపాటే కేవలం విజయ్ కనకరాజు మీద ఉన్న నమ్మకంతోనే యూత్ మొత్తం అటువైపు అట్రాక్ట్ అవుతున్నారు. ఏదైనా లియో బాలయ్యకి గట్టి దెబ్బ వేసిందని చెప్పవచ్చు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -