Prabhas: ప్రభాస్ ను అన్నా అని పిలిచి అవమానించిన హీరోయిన్.. ఏమైందంటే?

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్నాడు. ప్రభాస్ పెళ్లి గురించి చాలా కాలంగా అనేక రకాల పుకార్లు వచ్చినా అవి నిజం కాదని ఎప్పటికప్పుడు డార్లింగ్ చెబుతూ వస్తున్నాడు. బాహుబలి చిత్రం తర్వాత స్వీటీ అనుష్కను పెళ్లాడబోతున్నాడనే పుకార్లు షికార్లు చేశాయి. కానీ, తర్వాత తాము బెస్ట్ ఫ్రెండ్స్ అని వారు అనేక వేదికలపై చెబుతూ వచ్చారు.

హీరోయిన్లతో పాటు ఎందరో యువతుల మనసు దోచుకున్న ప్రభాస్ కు.. లేటెస్ట్ గా ఓ యంగ్ హీరోయిన్ షాక్ ఇచ్చింది. ఏకంగా అన్నా అని పిలిచేసింది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. అన్నా అని పిలవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా. ఆమె ప్రస్తుతం లైక్ షేర్ సబ్ స్క్రైబ్ చిత్రంలో నటిస్తోంది. హీరోగా సంతోష్ శోభన్ నటిస్తున్నాడు.

ఈ చిత్రం నవంబర్ 4న విడుదల అవుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో నాని ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. ప్రభాస్ ను అన్నా అని సంబోధించింది. తాను నటించిన జాతి రత్నాలు సినిమా ట్రైలర్ ను కూడా ప్రభాస్ అన్న విడుదల చేశారని, అందుకే హిట్ అయ్యిందని తెలిపింది. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ను కూడా ప్రభాస్ అన్నే విడుదల చేశాడని చెప్పింది. ఇది కూడా హిట్ అవుతుందని దీమా వ్యక్తం చేసింది.

ఆమెకు బుద్ధి ఉందా? అలా పిలుస్తారా?

ఇక ప్రభాస్ ను అన్నా అని పిలవడంపై డార్లింగ్ ఫ్యాన్స్ సుర్రుమంటున్నారు. ఏకంగా అన్నా అని పిలవడం ఏంటని వాపోతున్నారు. ఇలా అయితే ప్రతి హీరోయిన్ ఈమెను ఆదర్శంగా తీసుకొని అన్నా అని పిలిస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అసలే ప్రభాస్ పెళ్లి గురించి తామంతా ఖంగారు పడుతుంటే ఇప్పుడు హీరోయిన్ అన్నా అని పిలవడం ఏం బాగోలేదని చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts