Allu Sireesh: అల్లు శిరీష్‌ను ఆయన అంత మాట అన్నారా? చెప్పుతో కొడతానని చెప్పారట..

Allu Sireesh: బడా నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్ ఇటీవల ఊర్వసివో, రాక్షసివో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ మూవీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఇందులో హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ తో కాస్త రొమాంటిక్ సన్నివేశాలు తీయడంతో యువత బాగా కనెక్ట్ అయ్యారు. అల్లు శిరీష్ తక్కువ సినిమాల్లోనే నటించినా ఇంకా మంచి గుర్తింపు కోసం వెయిట్ చేయాల్సి వస్తోంది.

 

తాజాగా ఊర్వసివో రాక్షసివో సినిమాతో కమర్షియల్ గా హిట్ అందుకున్నాడు అల్లు శిరీష్. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన తండ్రి సంస్థ అయిన గీతా ఆర్ట్స్.. కథకే ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో తాను ఏది అనుకుంటే అది మాట్లాడేవాడినని చెప్పారు శిరీష్. డైరెక్టర్లతో నేరుగా కథ నచ్చేలేదని చెప్పేవాడినన్నారు. కుర్రతనం, ఉడుకు రక్తం కాబట్టి అలా ప్రవర్తించేవాడినన్నారు.

 

తనకు చిన్నప్పటి నుంచి బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ అంటే చాలా ఇష్టమని అల్లు శిరీష్ చెప్పాడు. గజిని మూవీ హిందీ వర్షన్ లో తాను పని చేశానని చెప్పాడు. ఆమిర్ నటించిన హిందీ వర్షన్ గజిని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 200 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించిందన్నాడు. తాను కమర్షియల్ హీరో స్థాయికి ఇంకా చేరుకోలేదని, దానికి సమయం పడుతుందన్నాడు.

 

మా నాన్న కారు విషయంలో అలా అన్నారు..
మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమా అంటే తనకు చాలా ఇష్టమని అల్లు శిరీష్ అన్నాడు. ఒక్క క్షణం మూవీ కోసం బాగా కష్టపడ్డానని శిరీష్ చెప్పుకొచ్చాడు. తన అన్న బన్నీకి 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత తన తండ్రి కారు గిఫ్ట్ గా ఇచ్చారని గుర్తు చేసుకున్నాడు. తనకు కూడా కారు కావాలని అడిగానని.. చెప్పుతో కొడతానంటూ అల్లు అరవింద్ ఫైర్ అయ్యారని శిరీష్ గుర్తు చేసుకున్నాడు. ఇక తన సినిమాల విషయంలో మంచి కథలను ఎంపిక చేసుకొని నటించడానికి ప్రాధాన్యం ఇస్తానన్నాడు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: సీఎం జగన్ కు ఆ ఎన్నికలంటే భయమా.. ఏం జరిగిందంటే?

CM Jagan: ఏపీలో కొన్ని స్థానిక సంస్థల ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ ఎన్నికలను నిర్వహించడానికి జగన్ సర్కారు వెనుకడుగు వేస్తోందని తెలుస్తోంది. అయితే ఏపీ ప్రభుత్వం తాజాగా ఎన్నికల గురించి...
- Advertisement -
- Advertisement -