Allu Sirish: అల్లు శిరీష్ ను మాయలో పడేసిన హీరోయిన్ ఆమేనా?

Allu Sirish: సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలబ్రిటీలు ప్రస్తుత కాలంలో ప్రేమించి పెళ్లిళ్లు చేసుకోవడం సర్వసాధారణంగా మారింది. అయితే పెళ్లికి ముందే చాలామంది సెలబ్రిటీలు ప్రేమలో పడి కొంతకాలం పాటు డేటింగ్ చేసిన అనంతరం పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇలా పెళ్లిళ్లు చేసుకున్న వారు కొందరు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండక మరికొందరు మాత్రం కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకొని విడిపోతున్నారు.

ఈ విధంగా ఎంతో మంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకొని కలిసి జీవితాన్ని గడుపుతూ ఉండగా మరికొందరు భార్యాభర్తలుగా ఉండలేక విడాకులు తీసుకుని విడిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి.ఇకపోతే తాజాగా నటుడు వరుణ్ తేజ్ సైతం నటి లావణ్య త్రిపాఠినీ ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి నిశ్చితార్థం ఏంతో ఘనంగా జరిగింది.

 

త్వరలోనే వీళ్ళిద్దరి వివాహం జరగబోతుంది అయితే తాజాగా మరొక హీరో కూడా వరుణ్ బాటలోనే ఉన్నారని ఆయన కూడా ఏ క్షణమైనా ఇలా తన ప్రేమ విషయాన్ని బ్లాస్ట్ చేసే పరిస్థితిలో ఉన్నాయని తెలుస్తుంది. ఆ హీరో మరెవరో కాదు అల్లు శిరీష్.అల్లు అరవింద్ వారసుడుగా ఇండస్ట్రీలోకి వచ్చిన శిరీష్ ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ కాలేదు అయితే శిరీష్ నటించిన ఊర్వశివో రాక్షశివో సినిమా ద్వారా అను ఇమ్మానుయేల్ తో ప్రేమలో పడ్డారని తెలుస్తుంది.

 

ఈ సినిమాలో వీరిద్దరి పర్ఫామెన్స్ ఆరెంజ్ లో ఉంది. ఇద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఉండడంతో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున వీరి గురించి వార్తలు వచ్చాయి.అయితే వీరి ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నారని ఈయన కూడా వరుణ్ తేజ్ లాగా ఈ విషయాన్ని ప్రకటించబోతున్నారంటూ పలువురు భావిస్తున్నారు. కానీ శిరీష్ సన్నిహితుల సమాచారం మేరకు ప్రస్తుతం శిరీష్ తన కెరియర్ పై ఫోకస్ పెట్టారని తెలుస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: ఉప్మాకు అమ్ముడుపోవద్దంటూ పవన్ కళ్యాణ్ సెటైర్లు.. ఆ ఉప్మా ఎవరంటే?

Pawan Kalyan:  ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పవన్ కళ్యాణ్ తన ప్రచారం లో జోరు, ప్రసంగాలలో హోరు పెంచుతున్నారు. తనదైన స్టైల్ లో ప్రతిపక్షం వారిని విమర్శిస్తూ కూటమి అధికారంలోకి వస్తే...
- Advertisement -
- Advertisement -