Ananya Nagalla: సినిమా ఆఫర్ల కోసం ఆ పార్ట్ సర్జరీ.. ఇప్పుడేమో ఇలా?

Ananya Nagalla: తెలుగు సినీ ప్రేక్షకులకు అనన్య నాగళ్ళ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. మల్లేశం సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ సినిమాలో ప్రియదర్శి భార్యగా తన చక్కని నటన కనబరిచింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్ లో ఒక మెయిన్ రోల్ చేసింది ఈ అమ్మడు.

మొత్తానికి ఈ తెలుగు అమ్మాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా తెగ హడావిడి చేస్తుంది. ఇక అనన్య సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఇన్ గ్రామ్ లో హాట్ ఫొటోలతో సోషల్ మీడియా ప్రియులను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ తెలుగు అమ్మాయి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తుంది.

అదేమిటంటే గత కొంతకాలంగా.. తన పెదాలు చిన్నవిగా ఉన్నాయని అనన్య బాధపడుతుందట. అంతేకాకుండా ఇలా పెదవులు చిన్నగా ఉండడం వల్లనే తనకు సినీ అవకాశాలు రావడం లేదని ఆమె భావిస్తుందట. ఇందువలన ఆమె చిన్నగా ఉన్న పెదవులను సర్జరీ సహాయంతో పెద్దగా చేసుకున్నట్లు కొందరు వార్తలు గుప్పిస్తున్నారు.

ఇక ఈ విషయం తెలిసిన కొందరు తన ఇన్ స్టాలో ఫోటోలు గమనించి నిజంగానే సర్జరీ చేయించుకుందేమో అని భావిస్తున్నారు. మరికొందరు ఆమె ముఖంలో సర్జరీ చేయించుకున్న తేడా స్పష్టంగా కనబడుతుంది అన్నట్లు చెబుతున్నారు.

ఇక ఈ వార్తలు వెనక వాస్తవమే ఎంత ఉందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో ఈ పుకార్లు మాత్రం తెగ షికార్లు కొడుతున్నాయి. మరి ఈ పుకార్ల గురించి అనన్య ఏమని స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం అనన్య తన పిచ్చెక్కించే అందాలతో.. సోషల్ మీడియాను ఒక రేంజ్ లో షేక్ చేస్తుంది. అనన్య ను కామెంట్లు రూపంలో నెటిజన్లు పొగిడి పారేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -