Anchor Pradeep: యాంకర్ ప్రదీప్ కు పెళ్లి అంటూ నెట్టింట్లో ప్రచారం.. అసలు నిజం?

Anchor Pradeep: తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్ ప్రదీప్ మాచిరాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన యాంకర్ తో ఎంతోమంది ప్రేక్షకులు మనసులలో జరగని ముద్రను వేసుకున్నాడు యాంకర్ ప్రదీప్. ఇక యాంకర్ ప్రదీప్ కి ఉన్న ఫాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. గడసరి అత్త సొగసరి కోడలు నుంచి ఢీ షో వరకు ఎన్నో షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ రెండు తెలుగు రాష్ట్రాలలో బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. తెలుగు టాప్ మేల్ యాంకర్ లలో ఒకరిగా రాణిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో హీరోగా కూడా నటించి మెప్పించాడు. కేవలం బుల్లితెరపై ప్రసారం అయ్యే షోలకు మాత్రమే కాకుండా అనేక రిలీజ్ ఈవెంట్లకు, ఆడియో ఫంక్షన్లకు కూడా యాంకర్ గా వ్యవహరించాడు. ఇప్పుడు వరకు ప్రదీప్ కోట్లలోనే సంపాదించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ప్రదీప్ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రదీప్ కి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. కానీ ప్రదీప్ మాత్రం తనకి ఇంకా వయసు రాలేదు అన్నట్టుగా చెప్పుకొని ఆ ప్రశ్నలని స్కిప్ చేస్తూ ఉంటాడు.

ఇప్పటికే ప్రదీప్ పెళ్లి విషయంలో ఎన్నో రకాల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ప్రదీప్ ఒక పొలిటికల్ లీడర్ కూతురిని వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. కాని ఆ వార్తలపై ప్రదీప్ ఇప్పటివరకు స్పందించలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రదీప్ తన పెళ్లి విషయంపై ఆసక్తికరంగా స్పందించారు. ఇంటర్వ్యూలో భాగంగా సదరు యాంకర్ ప్రశ్నిస్తూ మీ ఊతపదం ఏంటి అని అడగగా నీ యంకమ్మ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు ప్రదీప్. ఆ తర్వాత మీకు నిజంగానే పెళ్లి అయిపోయింది కదా అని అడగగా.. వెంటనే స్పందించిన ప్రదీప్ నాలుగైదు సార్లు అయిపోయింది యూట్యూబ్ లో చూడలేదా నువ్వు అంటూ తనపై తానే కౌంటర్స్ వేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటిలో పెళ్లి ఊసు ఎత్తేలా కనిపించడం లేదు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -