Pradeep: ప్రదీప్ భార్య బ్యాగ్రౌండ్ తెలిస్తే కళ్లు జిగేలుమనాల్సిందే!

Pradeep: బుల్లితెరపై నటిస్తూ ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న నటులు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో యాంకర్ ప్రదీప్ ఒకరు. ఏ షాప్ కి వెళ్ళినా సరే ఈ యాంకర్ పెళ్లి ప్రస్తావన రాకుండా మాత్రం ఉండే ప్రసక్తి లేదు. ప్రదీప్ పెళ్లి కోసం అతనికంటే చుట్టూ ఉండేవాళ్లే ఎక్కువ ఆరాటపడడం బుల్లితెరపై కామన్ అయిపోయింది. అతని పెళ్లి కోసం ఓ రియాల్టీ షోనే నిర్వహించారు అంటే ఆలోచించండి. అయితే ఊహించని విధంగా ఆ షో చాలా పెద్ద వివాదంతో ముగిసింది. ఇప్పటివరకు ప్రదీప్ పెళ్లి చేసుకోకపోవడం ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశం.

 

బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా యాంకర్ గా నటిస్తూ తనకంటూ ఓ ట్రేడ్ మార్క్ సృష్టించిన ప్రతి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టాడు. హీరోగా యాక్షన్ పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ ఎందుకో ఆ ఇండస్ట్రీలో కంటిన్యూ కాలేక బుల్లితెరకు పరిమితం అయిపోయాడు. అయితే తాజాగా మరోసారి ప్రదీప్ పెళ్లి ప్రస్తావన వైరల్ అయింది.

ప్రదీప్ కొంతకాలంగా ఓ ఫ్యాషన్ డిజైనర్ తో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడని పుకారు ఉంది. ఈ నేపథ్యంలో ఈమె ఎవరు ?బ్యాగ్రౌండ్ ఏమిటి? అనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈమె ఇటు బుల్లితెర అటు సోషల్ మీడియా సెలబ్రిటీలకు ఫ్యాషన్ డిజైనర్గా వ్యవహరిస్తోంది అని తెలిసింది.

 

చాలావరకు బిగ్ బాస్ తెలుగు షో లోని కంటెస్టెంట్స్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేసేది ఈ అమ్మాయే అట. వారి ఫిజిక్, బాడీ లాంగ్వేజ్ మరియు క్యారెక్టర్ కు మ్యాచ్ అయ్యే విధంగా ఎంతో ఇన్నోవేటివ్ డిజైన్స్ సృష్టించడం ఆమె ప్రత్యేకత. ఈమె సోషల్ మీడియాలో పెద్దగా కనిపించదు కానీ ఆమెకు మంచి పేరే ఉంది. ఈ నేపథ్యంలో ఆ ఫ్యాషన్ డిజైనర్ తో ప్రదీప్ కి పెళ్లి ఫిక్స్ అవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కులాంతర వివాహానికి పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని కూడా పుకారు వచ్చింది. కానీ ఇంకా ఈ విషయంపై ప్రదీప్ కుటుంబ సభ్యులు నుంచి కానీ సన్నిహితుల నుంచి కానీ ఎటువంటి క్లారిటీ లేదు. అయితే వచ్చే ఏడాది ప్రదీప్ పెళ్లి కచ్చితంగా జరుగుతుందని అతని కుటుంబ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -