Rashmi Gautam: మందు గ్లాస్ తో రచ్చ చేసిన యాంకర్ రష్మీ.. ఫ్రెండ్స్ తో కలిసి చిందులు

Rashmi Gautam: యాంకర్ రష్మీకి యూత్ లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ఆమెకు క్రేజ్ ఉంది. తన అందచందాలను ఆరబోస్తూ బుల్లితెరపై హాట్ యాంకర్ గా క్రేజ్ సంపాదించుకుంది. సుమ, అనసూయ తర్వాత టాప్ యాంకర్ గా రష్మీ పేరు సంపాదించుకుంది. పొట్టి పొట్టి దస్తులలో హాట్ హాట్ గా కనిపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతూ ఉంటుంది. జబర్దస్త్ షోతో యాంకర్ గా క్రేజ్ తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ.. ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా నటించింది.

గుంటూరు టాకీస్ సినిమాలో హాట్ హాట్ ఫొజులిస్తూ గ్లామర్ డోస్ తో రష్మీ రెచ్చకొట్టింది. కానీ ఈ సినిమా పరాజయం పాలవ్వడంతో ఆ తర్వాత రష్మీకి సినిమా అవకాశాలు ఏమీ రాలేదు. దీంతో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో పాటు పండుగ సమయాల్లో వచ్చే స్పెషల్ షోలలో కూడా పాల్గొంటూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తోంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మీ తన పెట్స్ కి సంబంధించిన ఫొటోలతో పాటు తన ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

ఈ క్రమంలో తాజాగా మందు గ్లాసులతో రష్మీ ఫొటోలతను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫ్రెండ్స్ తో కలిసి నైట్ పార్టీ చేసుకుంది. ఈ పార్టీలో పెగ్గులేస్తూ ఫుల్ చిల్ అయింది. మందు గ్లాసులు పట్టుకుని ఫ్రెండ్స్ తో ఉన్న ఫొటోను పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. నైట్ పార్టీలో మందు తాగుతూ రష్మీ ఫ్రెండ్స్ తో రచ్చ రచ్చ చేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. షూటింగ్ లతో బిజీబిజీగా ఉండే రష్మీ నైట్ ఇలా ఫ్రెండ్స్ తో తెగ ఎంజాయ్ చేస్తుందని మరికొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -