AP CM: కుటుంబం విశ్వసనీయత కోల్పోయిన ఏపీ సీఎం.. ఏం జరిగిందంటే?

AP CM: పరిస్థితులు ఇలా పగపట్టేశాయి ఏంటీ శాస్త్రీగారు అని దూకుడు సినిమాలో మహేష్ చెప్పిన డైలాగ్.. ఇప్పుడు జగన్ కు బాగా వర్తిస్తుంది. పరిస్థితులే కాదు.. పర్సన్స్ కూడా జగన్ పై పగబట్టేశారు అనిపిస్తుంది. అయితే, ఇదంతా జగన్ చేసుకున్న స్వయకృతాపరాధమే అని చెప్పడంలో ఎలాంటి అనుమానమూ లేదు. గత ఎన్నికల్లో చంద్రబాబు రాజకీయంగా ఒంటరివాడు అయ్యారు. బీజేపీ పొత్తు తెగిపోయింది. పవన్ సింగిల్‌గా పోటీ చేశారు. సో.. చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని విధంగా ఒంటరి పోరు చేశారు. ఇప్పుడు జగన్ ది అదే పరిస్థితి.. కాదు కాదు.. అంతకంటే దారుణమైన పరిస్థితి. చంద్రబాబు గత ఎన్నికల్లో రాజకీయంగా మాత్రమే ఒంటిరివాడు అయ్యారు. కానీ.. జగన్ ఈ ఎన్నికల్లో రాజకీయంగా, వ్యక్తిగతంగా కూడా ఒంటివాడుగా మిగిలారు. ఐదేళ్లు తిరిగేసరిగి పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి.

గత ఎన్నికల్లో జగన్ కు పరోక్షంగా సహకరించిన బీజేపీ.. ఈసారి సైలంట్‌గా ఉంది. జనంలో విపరీమైన వ్యతిరేకత వచ్చింది. పార్టీ మారడానికి చాలా మందినేతలు అదునుకోసం ఎదురుచూస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. కుటుంబ కలహాలే జగన్ కు పెద్ద సమస్యగా మారాయి. ఈ కుటుంబ కలహాల నుంచి తప్పించుకొని ఈ ఎన్నికలను నెట్టుకొని రావడం అంత సులభంగా కనిపించడం లేదు. గత ఎన్నికల్లో కొడుకు కోసం ప్రచారం చేసిన తల్లి విజయమ్మ.. ఎక్కడున్నారో ఎక్కడ లేరో తెలియడం లేదు. బైబై బాబు అంటూ బుస్సు యాత్ర చేసిన జగన్ గెలుపులో ఎంతో కొంత పాత్ర పోషించిన షర్మిల ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి వైసీపీనే గురిపెడుతున్నారు. అటు, ప్రత్యేక్షంగా కాకపోయినా.. జగన్ గెలుపు కోసం వైఎస్ సునీత కూడా గత ఎన్నికల్లో తనదైన ఉడతసాయం చేశారు. జగన్ కోసం కాకపోయినా.. తన తండ్రి వివేకానందరెడ్డి హత్యకేసులో నిజాలు తేలాలి అంటే అన్న సీఎం అవ్వాలి అని భావించారు. కానీ.. ఇప్పుడు ఆమె కూడా రివర్స్ అయ్యారు.

 

షర్మిల కాంగ్రెస్‌లో చేరడమే జగన్ కు అతిపెద్ద సమస్యగా మారింది. షర్మిల ప్రచారం మొత్తం జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా జరుగుతోంది. షర్మిల ఈ ఎన్నికల్లో ఏం సాధిస్తారో తెలియదు కానీ.. అన్న ఓటమికి ప్రధాన కారణమవుతారనడంలో అనుమానం లేదు. షర్మిల తనతోపాటు సునీతను కూడా తనవైపు తిప్పుకొని కడప ఎంపీ స్థానానికి పోటీ చేయించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైఎస్ వివేకా హత్యకేసు, కోడికత్తి కేసులను వాడుకొని అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అవే కేసులు జగన్ మెడకు చుట్టుకొని వైసీపీ ఓటమికి కారణమయ్యేలా ఉన్నాయి. షర్మిల, సునీత మాత్రమే కాదు.. వైఎస్ బంధుగణం మొత్తం జగన్ కు దూరమయ్యారు. దీనికి కారణం వివేకాహత్య కేసు. ఈ కేసులో కీలక నిందితుడుగా ఉన్న అవినాస్ ను కాపాడటానికి జగన్ తన సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అదే ఆయన కొంపముంచింది. తన అనుకున్నవారిని దూరం చేసింది. రాజకీయంగా ఒంటరి అయితే.. అవే రాజకీయ పరిస్థితులు రేపు అనుకూలంగా మారొచ్చు. కానీ, తన అనుకున్నవారిని దూరం చేసుకుంటే ఇప్పట్లో రాజకీయ భవిష్యత్ ఉండదు. ఎందుకంటే… సొంతవారికే న్యాయం చేయన వ్యక్తి మనకు ఏం న్యాయం చేస్తాడనే ఆలోచన ప్రజల్లో వస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన ఫలితాలను ఇస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -