Prathipati Sarath: ఏపీ హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ.. ప్రత్తిపాటి శరత్ కేసులో భారీ షాక్ తగిలిందా?

Prathipati Sarath: ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో వైసిపి ప్రభుత్వానికి అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి ఇలా వైసిపి పార్టీ నుంచి ఇప్పటికే ఎంతోమంది నాయకులు తెలుగుదేశం గూటికి చేరటం వైసిపికి అలాగే వైసిపి అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ అనే చెప్పాలి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో దాడులకు అక్రమంగా కేసులు పెడుతూ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి మరోసారి గట్టి షాక్ తగిలింది.

తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు ప్రత్తిపాటి శరత్ పై అక్రమంగా కేసులు పెట్టిన సంగతి తెలిసిందే అయితే ఈయనని సిఐడి కస్టడీలోకి తీసుకోవాలని విషయాన్ని కోర్టు తోసిపుచ్చింది. యువ నాయకుడు శరత్ ను కస్టడీకి ఇవ్వడాన్ని నిరాకరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పోలీసులు దాఖలు చేసిన క్రిమినల్ రివిజన్ పిటిషన్‌పై కోర్టు తీర్పు ఇచ్చింది.

ఇక ఈ పిటిషన్ పై బుధవారం విచారణ జరిగింది ఇక ఈ విచారణ అనంతరం కోర్టు ఈ విషయంపై తీర్పును ప్రకటిస్తూ… కిందస్థాయి కోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్ట్ సమర్థించింది. ఇలా ఈయనని కస్టడీకి తీసుకోవడానికి కుదరదు అనే విషయాన్ని కోర్టు వెల్లడించడంతో వైసిపి నేతలు ఆశలు కాస్త ఆడి ఆశలుగా మారాయిని చెప్పాలి.

ఇలా ఎంతోమంది టీడీపీ నాయకులు పై అక్రమ కేసులను పెడుతూ వారిని ఇబ్బందులకు వైసిపి నాయకులు గురి చేస్తున్నారు. ఎన్నికలలో ఓడిపోతామని భయం పట్టుకోవడంతో ఇలా అడ్డుదారులను తొక్కుతూ ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారని ఏదైనా ఉంటే డైరెక్ట్ గా నన్ను ఎదుర్కోవాలి కానీ ఇలా కుటుంబ సభ్యులపై అక్రమంగా కేసులు పెట్టడం భావ్యం కాదు అంటూ గతంలో ప్రత్తిపాటి పుల్లారావు కూడా ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -