CM Jagan Govt: హైకోర్టు సాక్షిగా అబద్ధాలు చెప్పిన జగన్ సర్కార్.. మరీ ఇంత దారుణంగా చేయాలా?

CM Jagan Govt: ఏపీ ప్రభుత్వ అరచకాలు, అబద్దాలు హైకోర్టు సాక్షిగా చాలా సార్లు బయటపడ్డాయి. ప్రభుత్వ విధానాలు, తప్పులను ప్రతిపక్షాలు ప్రశ్నించినా.. ఎదురు దాడికి దిగడమే తప్పా ఎప్పూడు స్పష్టమైన సమాధానం చెప్పిన దాఖలాలు లేవు. కానీ, హైకోర్టులో ఎదురుదాడికి అవకాశం ఉండదు కనుక తప్పును అంగీకరించి.. ప్రభుత్వం తరఫున సంబంధిత శాఖా అధికారులో.. లేకపోతే అడ్వకేట్ జనరల్ కానీ క్షమాపణలు కోరినపుడు తప్పులు బయటపడతాయి. వైసీపీ నేతలు కోర్టు తీర్పులను దిక్కరించినా.. కోర్టు తీర్పులపై ఎదురు దాడికి దిగినా.. అవి కోర్టు బయటే. కాబట్టి న్యాయస్థానంలో మాత్రం ప్రభుత్వ అరాచకాలు ప్రజలకు తెలియడానికి ఆస్కారం ఉంటుంది. అయితే.. హైకోర్టుతో మొట్టికాయలు తినడం ఏపీ ప్రభుత్వానికి కొత్తేం కాదు. కానీ తప్పులు చేసి చీవాట్లు తినడం వేరు. తప్పులు చేసి వాటికి కప్పుకోవడానికి న్యాయమూర్తి ముందు అబద్దాలు చెప్పడం వేరు. అలాంటి అబద్దాలే చెప్పి న్యాయస్థానం ఎదుట ప్రభుత్వ ఏజీ తల దించుకున్నారు. అంతేకాదు.. ప్రభుత్వం అబద్దాలు విని ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదని న్యాయముర్తి కామెంట్స్ చేసిన వరకూ తెచ్చుకున్నారు ప్రభుత్వ పెద్దలు.

ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరం కోర్టుకు కొత్త భవనాన్ని నిర్మించపోవడం, పాత భవనానికి మరమ్మత్తు చేయించకపోవడంతో.. దేవిరెడ్డి రాజశేఖర్ రెడ్డి 2022లో హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై విచారణ చేపట్టి హైకోర్టు రాష్ట్రంలోని కోర్టు భవన నిర్మాణ ప్రాజెక్టులు ఎంత వరకు వచ్చాయో ఆరా తీసింది. ఐదేళ్ల క్రితం ప్రారంభమైన నిర్మాణాలు కూడా 10 శాతం కూడా పూర్తి కాకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గన్నవరం కోర్టు అంశంపై విచారణ చేపట్టిన హైకోర్టు నిర్మాణ పనులపై గతంలో వివరాలు కోరింది. కేంద్రం తన వాటా కింద 45 కోట్ల రూపాయలు విడుదల చేసిందని న్యాయవాది యజ్ఞ దత్ తెలిపారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వాటాను 30 కోట్ల రూపాయలు జమ చేసిందని ఏజీ తరఫున ప్రత్యేక జీపీ సుమన్ తెలిపారు.

వాయిదా తర్వాత ఇదే అంశంపై బుధవారం కోర్టు విచారణ చేపట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు సంబంధిత ఖాతాలో జమ కాలేదని తేల్చిచింది. దీనికి సమాధానంగా హైకోర్టు బిల్లులు అప్ లోడ్ చేస్తే నగదు జమ అవుతుందని జీపీ సుమన్ అన్నారు. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గత వాయిదాలో నగదు జమచేశామని ఎందుకు చెప్పారని మండిపడింది. పాలనా పరమైన సమస్యల వలన నగదు జమకాలేదని సుమన్ చెప్పే ప్రయత్నం చేశారు. ఈ వాదనల మధ్యలో ఎంటర్ అయిన యజ్ఞ దత్… కేంద్ర ప్రభుత్వ వాటా నేరుగా రాష్ట్ర ఖజానాకు వెళ్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా జమ చేస్తేనే మొత్తం.. ఆ అకౌంట్ కు వెళ్తాయని అన్నారు. కేవలం కేంద్ర నిధులు సంబంధిత ఖాతాలో జమ కావని చెప్పారు. దీంతో.. నిధులను ఎప్పుడు జమ చేస్తారని రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ ను న్యాయస్థానం ప్రశ్నించింది. కేంద్రం వాటా నిధులు కొన్ని గంట వ్యవధిలోనే జమచేస్తామని.. ఇక రాష్ట్ర వాటా మాత్రం జమ చేయడానికి 15 రోజుల సమయం కావాలని కోరారు.
ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. ఈ విషయంతో ఎలా స్పందించాలో తమకు అర్థం కావడం లేదని కామెంట్స్ చేసింది. వచ్చే వారానికి విచారణ వాయిదా వేసింది. మొత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా రూ.75 కోట్లు అప్పటి లోగా జమ చేయాలని ఆదేశించింది

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -