Court: వాలంటీర్ కు మైండ్ బ్లాంక్ అయ్యే షాకిచ్చిన కోర్టు.. ఏం జరిగిందంటే?

Court: విజయవాడకు చెందిన వాలంటీర్ పవన్ కళ్యాణ్ మానసిక క్షోభకు గురి చేశారంటూ చేసిన దాఖలు పిటిషన్ ను విజయవాడ కోర్టు తీసుకోలేదు. అసలు వాలంటీర్ నియామక పత్రం ఏది అంటూ కోర్టు ప్రశ్నించింది. దీంతో పిటిషన్ వెనక్కి పోయింది. దాంతో వైసీపీ పరువు పోయినట్లయింది. ఆ వాలంటీర్ వెనుక ఉన్నది వైసీపీ నేనని అందరికీ తెలుసు. ప్రభుత్వం కోర్టుకు వెళ్లడానికి జీవో ఇచ్చింది. కానీ ఇప్పటికీ వెళ్లలేకపోతోంది. ఎందుకంటే కోర్టుకెళ్తే వాలంటీర్ వ్యవస్థలోని బొక్కలన్నీ బయటకు వస్తాయి.

అందుకే కింది కోర్టులో పిటిషన్ వేసి ఏదో చేయాలి. ఏదో సాధించాలని అనుకుంది. అందుకు ఒక వాలంటీర్ ను పావుగా వాడుకున్నారు. మరి తాను వాలంటీర్ అని చెప్పడానికి ప్రభుత్వం జారీ చేసిన నియామకపత్రం చూపించాలిగా కానీ ఆ నియామక పత్రాన్ని మాత్రం ఇవ్వలేదు సదరు వాలంటీర్. అది ఇస్తే ఏ చట్టం కింద వాలంటీర్లను నియమించారన్నది స్పష్టత ఇవ్వాలి. స్వచ్చంద సేవకులకు డబ్బులు అదీ కూడా ప్రజాధనం ఇవ్వడాన్ని సమర్థించుకోవాలి. దీనికి ఏ చట్టమూ లేదు. అందుకే పవన్ పై పిటిషన్ కోర్టు తిరస్కరించినా కుక్కిన పేనులా సైలెంట్ గా బయటకు వచ్చారు.

 

పవన్ కోర్టుకు రావాల్సి ఉంటుందని అది, ఇది అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వైసీపీ లాయర్లు పిటిషన్ వెనక్కి వచ్చిందని, వస్తుందని ముందే తెలిసి కూడా ఓవరాక్షన్ చేశారు. ప్రభుత్వం బెదిరించడానికి బ్లాక్ మెయిల్ చేయాడనికి ఇలా వ్యవస్థల్ని వాడుకుంటుందన్న విమర్శలు ఈ కారణంగానే వస్తున్నాయి. కోర్టు ఇచ్చిన సమాధానంతో వైసీపీకి దారుణ అవమానం ఎదురైనట్లు అయింది. కోర్టుకీ వెళ్లడానికి ముందు పెద్దపెద్ద మాటలు మాట్లాడిన లాయర్లు ఒక్కసారిగా కోర్టు అటువంటి సమాధానం చెప్పడంతో దెబ్బకు మౌనంగా ఉండిపోయారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -