AP Politics: జగన్, చంద్రబాబు, పవన్ లకు నిద్ర కూడా లేదా.. ఆ టెన్షన్ల వల్ల ప్రశాంతత కోల్పోయారా?

AP Politics: ఏపీ ఎన్నికల ప్రచారం పీక్స్ కి చేరింది. అన్ని పార్టీల అధినేతలు జనంలోనే ఉన్నారు. ఎవరి ధీమా వాళ్లు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఈ మధ్య కాలంలో చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. సినిమా రేంజ్ సెటైర్లు వేస్తున్నారు. గతం కంటె ఎక్కువ ఉత్సాహం, నవ్వులు పూయిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే నమ్మకం ఆయనకు ఒకింత ఉంది. ఇక పవన్ కల్యాణ్ ఈసారి ఎలాగైన అసెంబ్లీలో అగుడుపెట్టాలనే దృడసంకల్పంతో ఉన్నారు. అందుకే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నార. వారాహి యాత్ర కూడా అక్కడి నుంచే మొదలుపెట్టారు. పిఠాపురంలో పవన్ ను ఓడించడానికి వైసీపీ పెద్ద సైన్యాన్నే దించింది. కానీ, జనసేన కూడా పెద్ద ఎత్తున పిఠాపురాన్ని మొహరించారు. ప్రతీ గ్రామానికి ఇంఛార్జులను వారికి వారే నియమించుకున్నారు. పవన్ కూడా గెలుపు ధీమాలో ఉన్నారు. అయితే, జనసేనకు లభించిన సీట్లతో ఎన్ని గెలుస్తామనే దానిపైనే ఆయన ఫోకస్.

ఇక.. సిద్దం సభలతో మొదటి దశ ప్రచారాన్ని పూర్తి చేసిన సీఎం జగన్.. మేమంతా సిద్దం అంటూ బస్సు యాత్రను కూడా చేస్తున్నారు. తన సంక్షేమ పథకాలనే తనను రక్షిస్తాయని జగన్ నమ్ముతున్నారు. బయటకు ధీమాగా కనిపిస్తున్నా.. లోలోపల ఆయా పార్టీ నాయకులకు, క్యాడర్ కు భయం మొదలైంది. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. కొంచెం అంటూ ఇటు అయితే.. ఐదేళ్లు అంతేమన సంగతి అనుకుంటున్నారు. వారి భయాలకు కూడా కారణం లేకపోలేదు.

వైసీపీ అధినేత సింగిల్ గా ప్రచారాన్ని రక్తి కట్టిస్తున్నా.. షర్మిల ఎఫెక్ట్ ఎంతో కొంత ఉంటుందని భావిస్తున్నారు. ఆమె రాజన్న బిడ్డను అంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. అంటే.. వైఎస్ అభిమానుల ఓట్లు చీల్చితే చాలా ప్రమాదం జరుగుతుంది. దీనికితోడు వైఎస్ వివేకాహత్య కేసును ఆమె ఎన్నికల ప్రధాన అస్త్రంగా వాడుతున్నారు. ఈసారి వివేకాహత్య కేసు ప్రభావం రాయలసీమలో ఉంటుందని చాలా మంది చెబుతున్నారు. గత ఎన్నికల్లో రాయలసీమ నాలుగు జిల్లాల్లో 52 నియోజవకర్గాలకు 49 స్థానాల్లో వైసీపీ గెలిచింది. ఇప్పుడు కొన్ని ప్రాంతాలు కోల్పోతుంది. దానికి తోడు వివేకాహత్య కేసు ప్రభావం చూపిస్తే జగన్ ప్రమాదం అంచున ఉన్నట్టే. ఇక.. క్రిస్టియన్ల ఓట్లు కూడా చాలా వరకూ షర్మిల ఆకర్షిస్తుంది. ఎంతో కొంత షర్మిల దెబ్బ వైసీపీపై పడుతుందని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

ఇక.. షర్మిల బీజేపీని టార్గెట్ చేయడం టీడీపీకి ప్రమాదకరం. బీజేపీ ప్రత్యేకహోదా ఇవ్వలేదని ఆమె విమర్శిస్తున్నారు. ఏ హామీతో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్నారని ఆమె ప్రశ్నిస్తున్నారు. దీంతో.. వైసీపీ మీద వ్యతిరేకతతో ఉన్నవాళ్లను టీడీపీకి ఓటు వేయాలంటే బీజేపీతో పొత్తు ఉంది కనుక ఆలోచించే అవకశం లేకపోలేదు. దీనికి తోడు.. గత ఎన్నికల్లో ముస్లింలు వైసీపీకి ఓటు వేశారు. ఈసారి జగన్ పై కోపంగా ఉన్నారు. కానీ, వారంతా టీడీపీకి ఓటు వేయాలనుకున్నా.. ఇప్పుడు ఆ పార్టీ బీజేపీతో పొత్తులో ఉందని ఆలోచిస్తున్నారు. బీజేపీతో పొత్తు టీడీపీకి తలనొప్పిగా మారే అవకాశం ఉంది.

ఇక పవన్ విషయానికి వస్తే కాపులు జనసేనకు పూర్తిగా మద్దతిస్తారని ఆయన భావిస్తున్నారు. కానీ, ఆ వ్యూహం ఎంతవరకూ వర్క్ అవుట్ అవుతుందో తెలియదు. ఎందుకంటే.. ముద్రగడ పద్మనాభం ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. ఆయన పిఠాపురంలో పవన్ ఓటమి కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. దీనికితోడు.. కాపు సంక్షేమ సంఘం పెట్టిన జోగయ్య కూడా పవన్ పై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పలు సార్లు బహిరంగ లేఖలు విడుదల చేశారు. దీంతో.. కాపులు ఎంత వరకు తనకు మద్దతిస్తారో చెప్పలేం. అందుకే పవన్ కూడా ఒకింత ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలు దగ్గర పడేకొద్ది 3 పార్టీల అధినేతలకు కంటి మీద కునుకు ఉండటం లేదు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -