NTR Statue: హైకోర్టు కేసు వల్ల ఎన్టీఆర్ విగ్రహంలో అలాంటి మార్పులు చేస్తున్నారా?

NTR Statue: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఖమ్మంలో భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావించిన విషయం తెలిసిందే.. అందులో భాగంగానే భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా ఆ విగ్రహం చూడటానికి శ్రీకృష్ణుడు రూపంలో ఉండడంతో అవి గ్రహంత యాదవ సంఘాలు అలాగే కరాటే కళ్యాణి, ఇతర కొన్ని సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు కోర్టు వరకు వెళ్లిన విషయం తెలిసిందే. కాగా ఎన్టీఆర్ విగ్రహంపై అభ్యంతరం తెలుపుతూ పలు హిందూ, యాదవ సంఘాలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాయి.

ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని కానీ శ్రీకృష్ణుడి రూపంలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు సరికాదంటూ వారి తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. దీంతో ఎన్టీఆర్‌ విగ్రహ ఏర్పాటుపై హైకోర్టు స్టే ఇచ్చింది. కోర్టు స్టే రావడంతో వెంటనే ఎన్టీఆర్ విగ్రహ కమిటీ సభ్యులు, ఎన్నారైలు స్పందించారు. కోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న అంశాలపై దృష్టి పెట్టారు. యాదవ సంఘాల అభ్యంతరాల మేరకు విగ్రహంలో మార్పులు చేసి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని ఎన్టీఆర్ విగ్రహ కమిటీ సభ్యులు తెలిపారు. ఇందులో భాగంగానే విగ్రహంలోని పింఛం, పిల్లనగ్రోవి తొలగించేందుకు ఓకే చెప్పారు. ఈమేరకు వాటిని తొలగించారు. దీంతో విగ్రహంపై యాదవ సంఘాల అభ్యంతరాలు తొలగిపోయే అవకాశం ఉంది.

 

మార్పుల నేపథ్యంలో విగ్రహ ఏర్పాటు పై విధించిన స్టేను హైకోర్టు ఎత్తివేస్తుందని విగ్రహ ఏర్పాటు కమిటీ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందన్న అంశపై ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు యథావిథిగా ఈ నెల 28న విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. ఆ కార్యక్రమానికి హీరో జూనియర్ ఎన్టీఆర్, సినీ ప్రముఖులు, ఎన్నారైలు హాజరకానున్నారు. మహానాయుడు ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ జరగబోతోంది అన్న సంతోషం ఒకవైపు కోటి ఈ విషయంపై ఎటువంటి తీర్పుని ఇస్తుంది అన్న టెన్షన్ మరొకవైపు. కాగా ఎన్టీఆర్ మహా విగ్రహాన్ని ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పై మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో తానా సభ్యులు, కొందరు ఎన్నారైలు, పారిశ్రామిక వేత్తలు కలిసి రూ. 4 కోట్ల భారీ వ్యయంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 54 అడుగుల ఎత్తైనా భారీ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -