NTR statue: ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ విషయంలో అలా జరుగుతోందా?

NTR statue: ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈనెల 28వ తేదీ ఎన్టీఆర్ శత జయంతి కావడంతో ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోని ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను పురస్కరించుకొని మే 28వ తేదీ ఖమ్మం జిల్లాలోని లకారం చెరువులో జూనియర్ ఎన్టీఆర్ ఆవిష్కరించాల్సిన ఎన్టీఆర్ విగ్రహంపై వివాదాలు అలుముకున్నాయి.

లకారం చెరువులో ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడు రూపంలో ఆవిష్కరించబోతుండడంతో ఈ విగ్రహవిష్కరణపై ఏకంగా హైకోర్టుకు 14 పిటిషన్లు దాఖలు కావడం గమనార్హం. ఇలా ఏకంగా 14 పిటిషన్లు దాఖలు కావడంతో ఈ పిటిషన్ ల పై విచారణ జరిపిన హైకోర్టు వదిలేవరకు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వీలులేదని తీర్పు వెల్లడించారు. అయితే హైకోర్టు చెప్పిన తీర్పు కొందరిలో తీవ్ర నిరాశలు కలిగిస్తుంది.

 

ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో ఆవిష్కరిస్తే నేటితరం పిల్లలు కృష్ణుడు అంటే ఎన్టీఆర్ అనే ఆలోచనలకు కూడా వచ్చే ప్రమాదం ఉందని అందుకే ఈ విగ్రహావిష్కరణకు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. స్వయంగా కరాటే కళ్యాణి ఖమ్మం జిల్లాలోని యాదవ సంఘం నేతలతో కలిసి ధర్నాకి కూడా దిగిన విషయం మనకు తెలిసిందే.

 

ఇక ఈ విగ్రహవిష్కరణ పై మరికొందరు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో ఆవిష్కరించబోతున్నారంటూ చర్చలు జరుగుతున్నాయి కానీ ఇప్పటివరకు రాని అభ్యంతరాలుతీరా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఏర్పాటు చేసే కొద్ది రోజుల ముందు అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ విషయంపై పెద్ద ఎత్తున రాజకీయాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.ఈ విగ్రహావిష్కరణ బీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో జరగడం వల్ల ఇతర పార్టీ నేతలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు 28న ఆవిష్కరణ చేయాలంటే.. అర్జంట్‌గా డివిజన్ బెంచ్ కు వెళ్లి అనుమతి పొందాల్సి ఉంది. మరి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ పై మంత్రి పువ్వాడ అజయ్ ఏం చేస్తారనే విషయం తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -