Remake: రీమేక్ సినిమాలు ఫ్లాప్ కావడానికి కారణాలివేనా.. ఆ భయంతోనే ఓకే చెబుతున్నారా?

Remake: ఈ మధ్యకాలంలో పెద్ద హీరోలు చేసిన సినిమాలు అన్ని రీమేక్ సినిమాలే. అవి కూడా పెద్దగా ఆడక పోవడం విశేషం. ఇంతకీ ఎందుకు రీమేక్ సినిమాలు చేయాలి.. స్ట్రైట్ గా సినిమాలు చేయటానికి తెలుగులో కథలు లేవా.. హీరోలని మెప్పించే అంత టాలెంట్ మన దర్శకులకి లేదా అంటే ఏమాత్రం కాదనే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఏ మాత్రం రిస్క్ ఫేస్ చేయడానికి ఇష్టపడని నటులు, దర్శకులు రీమేక్ ల వైపు దృష్టి పెడుతున్నారు. పోనీ అవైనా ఆడుతున్నాయా అంటే అది జరగడం లేదు దానికి కారణం ఏంటి అంటే..

సినిమా మీద వాళ్ళకి ఉండే తపన కంటే వాళ్లకి కావలసిన బెనిఫిట్స్ ఏవో ఆ సినిమాలోకి చొప్పించి మొత్తానికి మూలాన్ని చెడగొడుతున్నారు. నిజానికి మొన్న తీసిన బ్రో సినిమాలో శ్యాంబాబు క్యారెక్టర్ కేవలం రాజకీయ అవసరాల కోసం తీసిన సంగతి అని అందరికీ తెలిసిందే. అలాగే బోళా శంకర్ సినిమాలో ఖుషి సీన్ రిపీట్ చేయడం కూడా సినిమాని ఖూనీ చేసిందని చెప్పాలి. మరి ఎందుకు రీమేక్ సినిమాలు చేయటం, స్ట్రైట్ సినిమాలు చేయొచ్చు కదా అనే ప్రశ్న తలెత్తినప్పుడు నిజానికి ఈ కథ సినిమాగా చేస్తే హిట్ అవుతుంది అని జడ్జి చేసే హీరో నేటి తరంలో లేరనే చెప్పాలి.

 

ఈ కథ సినిమాగా తీస్తే నూరు రోజులు ఆడుతుంది అని కాన్ఫిడెంట్గా ఏ డైరెక్టర్ కూడా చెప్పలేకపోతున్నాడు. కొత్త వాళ్ళని పక్కన పెడితే దశాబ్దాలు తరబడి సినిమా ఇండస్ట్రీలో ఉన్న చిరంజీవి లాంటి వాళ్ళు సైతం స్టేట్ సినిమా చెయ్యకుండా రీమేక్ మీద ఆధారపడి సినిమాలు చేస్తున్నారు. అయినా కూడా ఆ సినిమాలు ఆడకపోవటం విశేషం. ఒకప్పుడు రీమేక్ సినిమాలు చూసేవారు అంటే వాటి ఒరిజినల్ సినిమాలు ఎవరు చూసేవారు కాదు.

 

కానీ నేటి ఓటీటీల పుణ్యమా అని ప్రతి సినిమా.. ప్రతి ప్రేక్షకుడు చూస్తున్నాడు. అందుకు ఉదాహరణ లూసిఫర్. మోహన్ లాల్ సినిమా లూసిఫర్ తెలుగులో ఓటీటీ లో కూడా వచ్చేసిన తర్వాత గాడ్ ఫాదర్ సినిమా చిరంజీవి ఎందుకు తీసాడో ఇప్పటికీ అర్థం కాని ఒక క్వశ్చన్ మార్క్. ఇక చివరిగా చెప్పొచ్చేదేంటంటే రీమేక్ సినిమా అంటే చేతకాని వాళ్లు ఎంచుకునే ఒక అడ్డదారి అనేది సమాధానం అంటున్నారు ప్రేక్షకులు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -