Remake: ఛత్రపతి రీమేక్ వీడియోను చూస్తే ఫ్యాన్స్ షాకవ్వాల్సిందే!

Remake: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో రీమేక్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం సర్వసాధారణం. ఇలా ఒక భాషలో తెరికెక్కిన సినిమాలు మరొక భాషలో ఆ భాషకు అనుగుణంగా ఆ హీరో బాడీ లాంగ్వేజ్ కి అనుకూలంగా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి సినిమాలను రీమేక్ చేస్తూ ఉంటారు.ఇలా ఒక భాష నుంచి మరొక భాషలోకి ఎన్నో సినిమాలు రీమేక్ అయి ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఇకపోతే కొన్ని సినిమాలు వారి భాషకు అనుగుణంగా హీరోల బాడీ లాంగ్వేజ్ కి అనుగుణంగా కాకుండా సినిమా హిట్ అయింది కదా అని మక్కిమక్కి దించుతూ ఉంటారు.

 

ఇలా ఒక భాషలో ఎలా ఉందో మరొక భాషలో అలాగే చేయడం వల్ల కొన్ని సార్లు సినిమా ప్రేక్షకులను మెప్పించడం ఏమో కానీ దారుణమైన ట్రోలింగ్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి ట్రోలింగ్స్ కోలీవుడ్ నటుడు విజయ్ దళపతి ఎన్నో ఎదుర్కొన్నారు. తెలుగులో 2005 లోరాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన చిత్రం చత్రపతి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టించిందో మనకు తెలిసిందే ఇక ఈ సినిమా తల్లి సెంటిమెంటుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాలో ప్రభాస్ కాట్రాజును కొట్టే సమయంలో ఎలా నటించారో ఆయన నటన ఎలా ఉందో ఇప్పటికీ ప్రేక్షకుల కళ్ళ ముందు అలా కదులుతుంది. ఇక ఇదే సినిమాని తమిళంలో కురిపి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. చత్రపతి సినిమాలో తల్లి సెంటిమెంట్ ఉండగా ఈ సినిమాలో తండ్రి సెంటిమెంట్ పెట్టారు. ఇక కాట్రాజు పాత్రలో హీరో జీవా నటించారు.

వీరిద్దరి మధ్య జరిగే సన్నివేశంలో చాలా సీరియస్ డైలాగులు ఉంటాయి అయితే ఇక్కడ విజయ్ బాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగా డైలాగులు పెట్టకుండా యధావిధిగా పెట్టడంతో విజయ్ చెప్పిన సీరియస్ డైలాగులు కూడా అందరికీ నవ్వు తెప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే చత్రపతి సినిమాలో అద్భుతమైన సీన్లను ఇలా కామెడీ చేశారంటూ నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రభాస్ తో చేస్తే ఆ సినిమా చత్రపతిగా ఉందని అలా కాకుండా విజయ్ తో చేయడం వల్ల ఆ సినిమా కాస్త చపాతీలా ఉందంటూ పెద్ద ఎత్తున నేటిజన్స్ భారీగా ట్రోల్ చేస్తున్నారు. ఇకపోతే కురిపి సినిమాని తెలుగులో తిరిగి దోపిడీ పేరుతో డబ్ చేసి విడుదల చేయడం గమనార్హం

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -