Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు రీమేక్ సినిమాలకు దూరంగా ఉండటానికి అసలు కారణమిదా?

Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారందరూ కూడా ఎక్కువగా ఇతర భాషలలో సూపర్ హిట్ అందుకున్నటువంటి సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇలా రీమేక్ సినిమాల ద్వారా కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకుంటున్నారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి మహేష్ బాబు మాత్రం రీమేక్ సినిమాలకు దూరంగా ఉన్నారు.

ఇలా మహేష్ బాబు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న రీమేక్ సినిమాలు చేయకపోవడానికి కారణం ఉంది. మహేష్ బాబు సినిమాల గురించి ఆలోచిస్తే ఈయన ఎప్పుడు కూడా ఎంతో విభిన్నమైన కొత్త కథ చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. అయితే రీమేక్ సినిమాలు చేయకపోవడానికి కారణాన్ని కూడా మహేష్ బాబు ఒక సందర్భంలో తెలియచేశారు.

 

ఒక భాషలో హిట్ అయిన సినిమాలను తిరిగి రీమేక్ చేయాలి అంటే ఆయనకు కంఫర్ట్ ఉండదని తెలిపారు. ఆల్రెడీ ఒక హీరో చేసిన సినిమాలను తిరిగి ప్రేక్షకులు తెరపై చూడలేరని ఆయన ఉద్దేశం అదే విధంగా ఆ సినిమాలో హీరో చేసినట్టుగానే తాను కూడా చేయాలా లేదా కొత్తగా చేయాలా అన్న కన్ఫ్యూజన్ తనలో ఉంటుందట. అందుకే తాను రీమేక్ జోలికి పోనని మహేష్ సందర్భంలో తెలిపారు.

 

ఇకపోతే తాను నటించిన సినిమాలు మాత్రం ఇతర భాషలలో రీమేక్ అవ్వాలని తాను కోరుకుంటున్నాను అంటూ మహేష్ బాబు తెలియజేశారు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకేక్కుతున్న గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత రాజమౌళి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -