Khushbu: వైరల్ అవుతున్న నటి ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు!

Khushbu: హీరోయిన్ ఖుష్బూ గురించి మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ ఖుష్బూ. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె అంచలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గా రాణించింది. ఇక తమిళంలో అయితే ఆమెకు అభిమానులు ఏకంగా గుడి కట్టారు అంటే ఆమెకు ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారు అర్థం చేసుకోవచ్చు. 90ల కాలంలో అందం అభినయంతో ఒక వెలుగు వెలిగింది.

కాగా ఇటీవల బీజెపీలో చేరిన ఆమె జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఎన్నికయిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈమె తమిళ నటుడు ప్రభుత్వం ప్రేమ పెళ్లి వ్యవహారం గురించి ప్రస్తుతం జోరుగా వార్తలు కొనసాగుతున్నాయి. చిన్న తంబి సినిమాలో వీరిద్దరూ కలిసి నటించగా.. పీకల్లోతు ప్రేమలో మునిగి తేలారు. అయితే 1993లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పటికే ప్రభుకి వివాహం కాగా, ఆయన తండ్రి, ప్రముఖ నటుడు శివాజీ గణేషన్ వీరి పెళ్లిని అంగీకరించలేదు. దీంతో వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో నాలుగు నెలలకే వీరు విడిపోగా. ఆ తరువాత ఆమె 2000వ సంవత్సరంలో దర్శకుడు సి.సుందర్‌ను వివాహం చేసుకున్నారు ఖుష్బు.

వీరికి ఇద్దరు ఆడపిల్లలు. అయితే ఇప్పుడు ఖుష్బు తాజాగా చేసిన ఓ పోస్టు వైరల్‌గా మారింది. 1991లో ప్రభు, ఖుష్బు జంటగా ప్రముఖ దర్శకుడు పి. వాసు తెరకెక్కిన చిత్రం చిన తంబీ. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా ఏప్రిల్ 12తో విడుదలై 32 సంవత్సరాలు అయిన సందర్భంగా ఖుష్బు ఎమోషనల్ పోస్టు చేసింది. చిన్నతంబి సినిమా చేసి అప్పుడే 32 ఏళ్లు అయిందంటే అసలు నమ్మలేకపోతున్నాను.. నాపై కురిపించిన ప్రేమకు ఎప్పుడూ మీ అందరికీ రుణపడి ఉంటాను.. వాసు, ప్రభు కోసం నా గుండె ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటుంది. మనసులను కదిలించే సంగీతాన్ని అందించిన ఇళయరాజా సర్‌కు.. అలాగే కె.బాలుకి ఎప్పటికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని రాసుకొచ్చింది ఖుష్బూ.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -