Black thread: కాలికి నల్లదారం కట్టుకుంటున్నారా.. ఇది తెలుసుకోవాల్సిందే?

Black thread: సాధారణంగా స్త్రీ పురుషులు కాళ్లకు నల్ల దారం కట్టుకోవడం మనం చూసే ఉంటాం. అయితే చాలామందిని అలా ఎందుకు కట్టుకుంటారు అని అడిగినప్పుడు దిష్టి తగలకుండా అని అంటూ ఉంటారు. కానీ అలా ఎందుకు కట్టుకుంటారు అన్నది చాలామందికి తెలియదు. కొందరు స్టైల్ కీ కూడా అలా నల్ల దారం ధరిస్తూ ఉంటారు. మరికొందరు జ్యోతిష్య కారణాల వల్ల కూడా కాలికి నల్ల దారం కట్టుకుంటూ ఉంటారు. అయితే అసలు నల్లదారం ఎందుకు పెడతారు? నల్ల దారం కట్టుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వాస్తవానికి కాలికి నల్ల దారం ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు జ్యోతిశాస్త్ర నిపుణులు. చాలామంది శని దోషం నుండి రక్షణ కోసం కాలికి నల్ల దారాన్ని కట్టుకుంటూ ఉంటారు. కట్టుకోవడం వల్ల ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయి. శని దోషం నీకు ఇబ్బంది కలిగిస్తుంటే ఒక నల్ల దారాన్ని తీసుకొని భక్తితో శనివారం రోజు మీ కాలికీ నల్లదారం కట్టుకోవాలి. అలాగే రాహు కేతువులు మీ పట్ల ఆగ్రహంగా ఉంటే శత్రు గ్రహం ఇంట్లోకి ప్రవేశించి మీ గృహ జీవితానికి ఆటంకం కలిగిస్తుంది. తద్వారా ఆర్థిక సమస్యలు కూడా వెంటాడుతాయి. అలాంటప్పుడు మీరు మీ ఎడమ కాలికి నల్లటి దారాన్ని కట్టుకోవాలి. కాలికి నల్ల దారం కట్టడం ద్వారా డబ్బు సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.

 

ఈ పరిహారం డబ్బు కొరత సమస్యలను తగ్గిస్తుంది. మీ ఇంటికి శ్రేయస్సును తెస్తుంది. మీరు మీ జీవితంలో చాలా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, మీరు మీ కుడి కాలికి నల్ల దారం కట్టాలి. తీవ్రమైన ద్వేషం,మనుసు నిండా కుళ్లు, కుట్రలతో ఉన్న ప్రతికూల వ్యక్తులు ఎవరినైనా చూసి అసూయ చెందితే హాని చేస్తారు. పిల్లలు కారణం లేకుండా ఏడ్చినా, అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయినా నల్ల దారం నరదిష్టికి నివారణగా పని చేస్తుంది. నల్ల దారం ఏ విధంగా ధరించాలి అన్న విషయాన్ని వస్తే.. శాస్త్ర ప్రకారం 9 ముడులు వేసిన తర్వాత దారాన్ని కట్టుకోవాలి. మీరు నలుపు రంగు దారం ధరించిన తర్వాత ఆ కాలికి ఇతర రంగుల దారాన్ని కట్టకూడదు. మంగళవారం లేదంటే శనివారం మంచి మంచి రోజుల్లో మాత్రమే నల్లదారాన్ని కట్టుకోవాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -