Black Thread: నల్ల దారం కాలికి కట్టుకుంటే ఈ లాభాలట.. నిజమేమిటంటే!

Black Thread: పూర్వం చిన్న పిల్లలకు తిష్టి తగలకుండా మెడలో లేదా కాలికి నల్ల దారం కట్టేవారు. నేటి కాలంలోనూ అది రిపిట్‌ అయింది. ఇప్పుడు చాలా మంది కాళ్లలో నల్లదారం కనిపిస్తుంది. ఒకరిని చూసిన మరొకరు నల్ల దారాన్ని కట్టుకుంటున్నారు. ఇది ఫ్యాషన్‌తో పాటు అందంగా కూడా కన్పిస్తోందని యువత పేర్కొంటున్నారు. అంతేకాక వీటికి పూసలు, మువ్వలు ఇలా కొత్త అదనపు హంగులు జోడించి కాలికి కట్టుకుంటున్నారు. ఇది కేవలం అందం కోసం అనుకుంటే పొరపాటే.. దీని వెనుక ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయని కొందరు చెబుతున్నారు. భారతదేశంలో నల్లదారం కట్టుకోవడం అనేది ఇప్పుడు మొదలైంది ఏం కాదు. ఇది మన హిందూ సంప్రదాయంలో పూర్వం నుంచి వస్తున్న ఆచారమే.

నలుపు రంగు ప్రతికూల శక్తిని త్వరగా గ్రహిస్తుంది. అందుకే దిష్టి తగలకుండా నలుపు రంగులో ఉన్న ఎన్నో వస్తువులని మనం వాడుతుంటాం. పిల్లలకు దిష్టి తగలకుండా నలుపు రంగు బొట్టు పెట్టడం, కాలికి పెట్టడం, అదే విధంగా, మనం కూడా బయటికి వెళ్లినప్పుడు పాదానికి దిష్టి తగలకుండా పెట్టడం, ఇలా ప్రతి విషయంలోనూ నలుపు రుంగుని ప్రతి కూల శక్తిని దూరం చేస్తుందని వాడతారు.పాదం పై భాగంలో, మెడ, నడుము, మణికట్టు చుట్టూ ఇలా అనేక ప్రదేశాల్లో వీటిని కట్టుకుంటారు.

ఇలా కట్టడం ఫ్యాషన్ అని కూడా యూత్ భావిస్తుంటుంది. అదే విధంగా, నల్ల దారాన్ని మొలతాడుగా నడుముకి కట్టుకుంటారు, కాలికి కూడా కట్టుకుంటారు. నడుముకి కట్టడం వల్ల పొట్ట పెరగకుండా, నడుము పరిమాణాన్ని నియంత్రించడంలో సాయపడుతుందని అంటారు. దీంతో పాటే వెన్ను నొప్పి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని కూడా నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల సంతానోత్పత్తికి మేలు జరుగుతుందని చెబుతున్నారు. నడుము దగ్గర నల్ల దారం ఉండడం వల్ల పునరుత్పత్తి అవయవాలు చల్లగా మారుతాయట. దీని వల్ల సంతానలేమి సమస్యలు దూరం అవుతాయని శాస్త్రలు,పెద్దలు పేర్కొంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -