Avinash Reddy: అవినాష్ రెడ్డి చెప్పినట్టుగానే సీబీఐ విచారణ.. అసలేమైందంటే?

Avinash Reddy: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం మనకు తెలిసిందే. వైఎస్ వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డికి భాగం ఉందంటూ సిబిఐ అధికారులు తనని వివిధ కోణాలలో విచారణ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే సిబిఐ వ్యవహార శైలిని వైయస్ అవినాష్ రెడ్డి తప్పుపట్టారు. సిబిఐ విచారణ అధికారి వ్యవహార గురించి అవినాష్ మాట్లాడుతూ తనను ఉద్దేశపూర్వకంగానే ఈ కేసులో ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారని తెలియజేశారు.

ఎంతసేపు ఉన్నా విచారణ అధికారులు ఈ కేసును ఒక కోణంలో మాత్రమే విచారణ జరుపుతున్నారని మరొక కోణంలో కూడా విచారణ చేయాల్సి ఉంటుందని అవినాష్ తెలిపారు.వివేక హత్య జరిగిన సాయంత్రం వరకు తన కుటుంబ సభ్యులు ఆయన సెల్ ఫోన్ ఆయన రాసినటువంటి లేఖను ఎందుకు పోలీసులకు అప్పగించలేదు అంటూ అవినాష్ గతంలో చేసిన వ్యాఖ్యలు మనకు తెలిసిందే.

 

సిబిఐ అధికారులు ఆ లేక గురించి విచారణ చేపట్టాలని ఈయన సూచించారు. అవినాష్ చెప్పిన విధంగానే సిబిఐ అధికారులు ఆలేఖ గురించి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వివేకా కుమార్తె సునీత, తన అల్లుడు రాజశేఖర్ రెడ్డిని సుమారు 5 గంటల పాటు విచారణ చేశారు. అదేవిధంగా వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డిని కూడా సిబిఐ అధికారులు విచారించారు.

 

అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని సిబిఐ అధికారులు తనని బలవంతం చేశారు అంటూ కృష్ణారెడ్డి బహిరంగంగా ఈ విషయాలను బయటపెట్టారు.తాను ఎవరి గురించి ఎలాంటి తప్పుడు ఆరోపణలు చేయనని నిజం మాత్రమే అక్కడ చెప్పానని అయితే సిబిఐ అధికారుల నుంచి నాకు ప్రాణహాని ఉంది అంటూ ఈయన కడప ఎస్పీకి ఫిర్యాదు చేసిన సంగతి మనకు తెలిసిందే.ఏది ఏమైనా అవినాష్ చెప్పిన విధంగానే సిబిఐ అధికారులు ఆ లేఖ విషయంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -