Sharmila Vs Avinash: అవినాష్ రెడ్డిపై షర్మిల పోటీ.. కడప జిల్లాలో అవినాష్ రెడ్డికి ఓటమి ఖాయమా?

Sharmila Vs Avinash: దేశంలో ఏపీ ఎన్నికలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఈ ఎన్నికలు దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాలు ఏపీ వైపే చూస్తారు. తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉంటాయి. తర్వాత పాలనపైనే ఎక్కువ దృష్టి ఉంటుంది. ఎవరు అధికారంలో ఉన్నా పరిస్థితి అలాగే ఉంటుంది. కానీ, ఏపీలో పరిస్థితి వేరు. ఏపీ రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్‌గా ఉంటాయి. అయితే.. ఈ ఎన్నికలు మాత్రం అందరి దృష్టి కడప ఎంపీ స్థానంపైనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వైసీపీ నుంచి జగన్ దగ్గర బంధువు అవినాష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి షర్మిల పోటీలో ఉంటారు.

షర్మిల కడప నుంచి పోటీ దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ తొలిజాబితాలో ఆమె పేరు ఉండే అవకాశం ఉంది. నిజానికి కడప ఎంపీ బరిలో వైఎస్ సునీత లేదా ఆమె తల్లి సౌభాగ్యమ్మ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. టీడీపీ తరుఫున కానీ.. ఇండిపెండెంట్ గా కానీ పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. టీడీపీ కూడా వారితో సంప్రదింపులు జరిపినట్టు వార్తాలు వచ్చాయి. కానీ.. కడప నుంచి తానే పోటీ చేస్తానని షర్మిల తన అనుచరులతో చెప్పినట్టు తెలుస్తోంది. సునీతకు, సౌభాగ్యమ్మకు న్యాయం జరిగే వరకూ వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో సునీత పోటీ నుంచి తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో.. ఇప్పుడు కడపలో అవినాష్ రెడ్డి వర్సెస్ షర్మిలగా రాజకీయం ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే.. జగన్ వర్సెస్ షర్మిలగానే ఉంటుంది. అవినాష్ రెడ్డి వివేకా హత్యకేసులో బెయిల్ పై ఉన్నారు. కానీ.. జగన్ ఆయనకు టికెట్ నిరాకరించడానికి సాహసించలేదు. వివేకాహత్య కేసుతో చాలా మంది వైఎస్ కుటుంబం అవినాష్ రెడ్డికి వ్యతిరేకం అయ్యారు.

అటు.. దస్తగిరి కూడా అవినాష్ రెడ్డి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఈ అంశాలన్ని షర్మిలకు కలిసి వచ్చేలా ఉన్నాయి. అటు కర్నాటక, తెలంగాణ ప్రభుత్వాల నుంచి షర్మిలకు సంపూర్ణంగా మద్దతు లభిస్తోంది. మొన్న విశాఖ వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ కూడా ఏపీలో కాంగ్రెస్ బలోపేతం కోసం ఎంతవరకైనా వెళ్తానని చెప్పారు. రాయలసీమలో వైసీపీ నేతలకు నిధులు రాకుండా కర్నాటక కాంగ్రెస్ అడ్డుకుంటుంది. రాయలసీమ నేతలకు బెంగళూరు నుంచే నిధులు వస్తాయి. అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఈసారి కడపలో అవినాష్ రెడ్డికి తలనొప్పులు తప్పేలా లేవు.

షర్మిల కడపలో పోటీచేస్తే స్థానిక టీడీపీ, జనసేన నేతలు కూడా ఆమెకు సహకరించే అవకాశం ఉంది. అవినాష్ రెడ్డిని ఓడించాలనేది షర్మిల లక్ష్యం అయితే.. జగన్ కంచుకోటను బద్దలకొట్టాలన్నది టీడీపీ లక్ష్యం రెండూ నెరవేరాలంటే బరిలో షర్మిల ఉంటే బాగుంటుందని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. దీంతో.. ఈసారి జగన్ సొంత కోటలు బద్దలవడం ఖాయంగా తెలుస్తోంది.

కడప మాత్రమే కాదు. పులివెందులలో కూడా ఆపరేషన్ మొదలైనట్టు తెలుస్తోంది. పులివెందుల నుంచి వైఎస్ సునీత లేదా సౌభాగ్యమ్మ పోటీకి దిగుతారని తెలుస్తోంది. అయితే.. వారు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో చూడాలి. గెలుపు ఓటములు పక్కన పెడితే.. అవినాష్ రెడ్డి అయినా.. ఇటు జగన్ అయినా సొంత నియోజకవర్గాల్లో గెలవడానికి సర్వశక్తులు ఒడ్డాల్సి వస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -