Etela Rajender: ముఖ్యమంత్రి పీఠంపై ఈటెల రాజేందర్.. కాంగ్రెస్ పార్టీ కల నెరవేరడం సాధ్యమేనా?

Etela Rajender:  బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వచ్చే ఎన్నికలలో రెండు చోట్ల పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద పోటీ చేయటంతో పాటు హుజురాబాద్ లో కూడా పోటీలో ఉంటానని చెప్పారు. హుజూరాబాద్ లో కార్యకర్తలే కథానాయకులు అవ్వాలని పిలుపునిచ్చిన సంగతి కూడా తెలిసిందే. గత కొంతకాలంగా ఈటల రాజేందర్ పోటీ చేసే స్థానంపై జోరుగా చర్చి జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈసారి హుజూరాబాద్ లో ఆయన కాకుండా ఆయన భార్య జమునా రెడ్డి పోటీ చేస్తారని చర్చ జరిగింది. ఇక ఈటల గజ్వేల్ లేదా మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని భావించారు. అయితే ఈ వార్తలకి చెక్ పెడుతూ ఈటెల క్లారిటీ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీలో రెండు చోట్ల పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. ఇలా అయితే వచ్చే ఎన్నికలలో బీజేపీ నుంచి సీఎం అభ్యర్థిగా రాజేందర్ బరిలోకి దిగబోతున్నారా అనే ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.

తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ తర్వాత ఈటల రాజేందర్ పేరే ముఖ్యంగా వినిపిస్తూ ఉంటుంది. మొన్నీమధ్యన జరిగిన ఒక బహిరంగ సభలో ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి అంటూ నినదించారు అంతా. ఈ సెగ బీజేపీ అధినాయకత్వానికి గట్టిగానే తాకినట్లుగా కనిపిస్తుంది. దాంతో బీజేపీ ఆలోచనలో పడింది. కేసీఆర్ కి పోటీగా ఈటల రాజేందర్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా దించితే ఎలా ఉంటుంది అనే మంతనాలు కూడా జరుగుతున్నాయని సమాచారం.

ఇంకేముంది ఈటెల రాజేందర్ కి అప్పుడే ముఖ్యమంత్రి కళ వచ్చేసినట్లే అని ఆయన వర్గం వారు సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణ బీజేపీ లో నిన్న మొన్నటిదాకా బండి సంజయ్ హవా నడిచింది. బీజేపీ అధ్యక్షుడిగా ఆయన ఉన్నన్నాళ్ళు ఈటల రాజేందర్ ఇబ్బందికరంగానే కొనసాగారు. ఒక దశలో ఆయన పార్టీ మారతారు అన్న ప్రచారం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయనకి ఆహ్వానం కూడా వెళ్లినట్లు సమాచారం. ఎప్పుడైతే బీజేపీ లో ఈటల రాజేందర్ హవా పెరిగిందో అప్పుడే బీజేపీ లో కొత్త ఆలోచన మొదలైంది. పార్టీ ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారో,లేదో వచ్చే ఎన్నికలలో చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -