YCP Vs Janasena: వైసీపీ వర్సెస్ జనసేన.. తాడేపల్లిగూడెంలో ఆ పార్టీ అభ్యర్థి విజేతగా నిలవనున్నారా?

YCP Vs Janasena: గత ఎన్నికల్లో వైసీపీ సుమారు 45కు పైగా స్థానాలు 20 వేల లోపు మెజార్టీతో గెలిచింది. అక్కడ ఓట్లు చీలడంతో ఆయా స్థానాలను ప్రతిపక్షాలు వైసీపీకి విదిలేశాయి. అలాంటి స్థానాల్లో తాడేపల్లి గూడెం ఒకటి. అక్కడ నుంచి వైసీపీ తరుఫున మంత్రి, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. పొత్తులో భాగంగా తాడేపల్లి గూడెం సీటు జనసేనకు వచ్చింది. తాడేపల్లి గూడెం నుంచి జనసేన తరుఫున బొలిశెట్టి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా ఆయన జనసేన తరుఫునే పోటీ చేశారు. అప్పుడు మొదటి స్థానంలో కొట్టు సత్యనారాయణ, రెండో స్థానాలో టీడీపీ అభ్యర్థి ఉండగా, బొలిశెట్టి శ్రీనివాస్ మూడో స్థానానికి పరిమితం అయ్యారు. అయితే, అధికార వైసీపీ గత ఎన్నికల్లో కేవలం 16 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి కనుక.. గెలుపు ఖాయమని జనసేన శ్రేణులు చెబుతున్నారు.

తాడేపల్లి గూడెం హోల్‌సేల్ వ్యాపారాలకు కేంద్రంగా ఉంది. ఇక్కడ రాజకీయం చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. తాడేపల్లి గూడెంలో పోటీ చేసిన అన్ని పార్టీలు కనీసం ఒక్కసారి అయినా గెలిచాయి. అంటే.. ఇక్కడ ప్రజలు అందరినీ ఆదరిస్తారు. 1955లో తాడేపల్లిగూడెంలో నియోజవర్గం ఏర్పడింది. ఇప్పటి వరకూ అక్కడ 15 సార్లు ఎన్నికలు జరిగితే 7 సార్లు కాంగ్రెస్ గెలిచింది. టీడీపీ 5సార్లు విజయం సాధించింది. ఆ తర్వాత ప్రజారాజ్యం, బీజేపీ, వైసీపీ చెరోసారి గెలిచాయి. దీంతో..ఈసారి కొత్తగా జనసేన అభ్యర్థి బొలిశెట్టికి పట్టం కడతారా? లేకపోతే వైసీపీ నేత కొట్టు సత్యనారాయణనే మరోసారి గెలిపిస్తారా అనే ఉత్కంఠ నెలకొంది.

తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 2 లక్షల 14 వేల 554 మంది ఓటర్లు ఉన్నారు. అందులో మహిళలే లక్ష 9 వేల మంది ఉన్నారు. అంటే సగానికి పైగా మహిళలే ఉన్నారు. అందుకే అక్కడ మహిళలను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని పార్టీలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. మరో వైపు ఇక్కడ కాపు ఓటర్లు 60 శాతానికి పైగా ఉంటారు. అందుకే అన్ని పార్టీలు ఇక్కడ కాపు నేతకే టికెట్ ఇస్తారు. ఇక్కడ జనసేనకు అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. పైగా పవన్ కల్యాన్ సొంత జిల్లాలోనే తాడేపల్లి గూడెం ఉండటం జనసేన అభ్యర్థికి మరో అడ్వాంటేజ్. ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉందని కూటమి నేతలు చెబుతున్నారు. నియోజవర్గంలో తీవ్రమైన అవినీతి జరిగిందని జనసేన నేతలు చెబుతున్నారు.

డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అవినీతి, ప్రభుత్వం అరాచకంతో ప్రజలు విసిగిపోయారని ఆరోపిస్తున్నారు. అయితే, కొట్టు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. నియోజకవర్గాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేశానని అంటున్నారు. రోడ్లు వేశానని చెబుతున్నారు. అయితే.. ప్రత్యర్థి ఇక్కడ బలంగా ఉన్నారని వైసీపీ అధినేత జగన్ భావించారు. అందుకే, ఈసారి కొట్టు సత్యనారాయణ తన కొడుకును పోటీకి దించాలి అనుకున్నా.. జగన్ మాత్రం ఆయన్నే బరిలో ఉంచారు. తాడేపల్లిగూడెంలో వైసీపీ గెలుపు అంత ఈజీ కాదని వైసీపీ నాయకత్వం కూడా భావిస్తుంది. అన్ని పార్టీలను ఆదరించిన తాడేపల్లి గూడెం ప్రజలు ఈసారి తమకు అవకాశం ఇస్తారని జనసేన నేతలు చెబుతున్నారు. స్థానికంగా కూడా పరిస్థితితులు ఈసారి జనసేనకే అనుకూలంగా ఉన్నాయి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -