WhatsApp: వాట్సాప్ ద్వారా రుణం పొందవచ్చా.. అందుకోసం ఏం చేయాలంటే?

WhatsApp: వాట్సప్ అంటే కేవలం చాటింగ్ చేసుకోవడానికి వీడియో కాల్స్ మాట్లాడుకోవడానికి అని మాత్రమే చాలామంది భావిస్తారు. కానీ వాట్సాప్ ద్వారా మనం లోన్స్ కూడా తీసుకోవచ్చు అనే విషయం చాలా మందికి తెలియదు.వాట్సప్ ద్వారా లోన్ తీసుకోవడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా ఇది నిజం మరి వాట్సప్ ద్వారా ఎలా లోన్ పొందాలి? లోన్ పొందాలి అంటే ఎలాంటి వివరాలు అందించాలి? అసలు ఏ ఫైనాన్స్ సంస్థల్లో అందిస్తుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

వాట్సప్ ద్వారా లోన్ పొందే అవకాశాన్ని ఐఐఎఫ్ఎల్ కల్పిస్తుంది. భారతదేశంలో అతిపెద్ద ఫైనాన్స్ సంస్థ అయినటువంటి ఐఐఎఫ్ఎల్ వాట్సప్ వినియోగదారుల కోసం ఈ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది ఇలా వాట్సాప్ ద్వారా ఏకంగా 10 లక్షల వరకు రుణం తీసుకొని అవకాశాన్ని కల్పిస్తుంది. మరి మనం వాట్సప్ ద్వారా లోన్ పొందాలి అంటే ఏం చేయాలి అనే విషయానికి వస్తే…

 

వాట్సప్ ద్వారా లోన్ పొందాలి అనుకుంటే 9019702184 నంబర్ కు హాయ్ అని మెసేజ్ చేయాలి. ఇలా మెసేజ్ చేసిన తర్వాత మనకు ఈ ఫైనాన్స్ సంస్థ నుంచి రిప్లై వస్తుంది అనంతరం వారు అడిగినటువంటి సమాచారాన్ని మనం అందించాలి. ఇలా ఈ ఐఐఎఫ్ఎల్
సమస్త వారు మనం అందించిన సమాచారం బట్టి మనకు 10 లక్షల రూపాయలు లోన్ వస్తుందా లేదా ఎంత మొత్తంలో లోన్ వస్తుందనే వివరాలన్నింటినీ తెలియజేస్తారు.

 

ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ సంస్థ ద్వారా మనం బిజినెస్ కోసం లేదా హోమ్ లోన్స్ పంటి వాటిని కూడా పొందవచ్చు అయితే ఈ సమస్త వారు మాత్రం చిన్న వ్యాపారులపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇలా చిన్న వ్యాపారులను ఆర్థికంగా ముందుకు తీసుకు రావడం కోసమే ఇలాంటి లోన్స్ వారికి అందుబాటులోకి తీసుకువచ్చామని ఐఐఎఫ్ఎల్ కంపెనీ హెడ్ భరత్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇలా వాట్సప్ ద్వారా లోన్ పొంది వ్యాపార రంగంలో ముందుకు కొనసాగాలనే వారికి అవకాశాలను కల్పిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -