Birmingham: పింఛన్ కోసం వృద్ధుడిని రెండేళ్లపాటు ఫ్రిడ్జ్ లో అలా?

Birmingham: ప్రస్తుత రోజుల్లో చాలామంది డబ్బు కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు. అంతేకాకుండా ఎంతటి నీచనికైనా దిగజారుతున్నారు. డబ్బు కోసం ఎదుటి వ్యక్తిని చంపడానికి కూడా వెనకాడడం లేదు. ఎదుటివారిని దారుణంగా మోసం చేస్తూ అడ్డగోలుగా డబ్బులు సంపాదిస్తున్న వారు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక దుర్మార్గుడు కూడా పింఛన్ కోసం వృద్ధుడిని ఏకంగా రెండేళ్లపాటు ఫ్రిడ్జ్ లో దాచాడు. ఈ దారుణమైన ఘటన బర్మింగ్ హామ్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే.. బర్మింగ్‌హామ్‌ లోని క్లీవ్ ల్యాండ్ టవర్ వద్ద డామియాన్ జాన్సన్, జాన్ వైన్‌రైట్ ఒక ఫ్లాట్ లో నివసిస్తున్నారు.

కాగా జాన్ వైన్‌రైట్ వయసు 71 సంవత్సరాలు వృద్దాప్య కారణంగా 2018 సెప్టెంబర్ నెలలో మరణించాడు. ఈ క్రమంలోనే డామియాన్ జాన్సన్ ఒక ప్లాన్ వేశాడు. వైన్‌రైట్ మరణించిన విషయాన్ని బయటకు చెప్పకుండా దాచాడు. వైన్‌రైట్ శవాన్నీ ఫ్రిడ్జ్ లో దాచాడు. ఇక వైన్‌రైట్ కి వస్తున్న పెన్షన్ డబ్బులు తన సరదాల కోసం వాడుకోవడం మొదలు పెట్టాడు. వైన్‌రైట్ కార్డులను కూడా ఉపయోగించేవాడు జాన్సన్. అయితే ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా పెన్షన్ డబ్బులు వాడుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ వచ్చాడు జాన్సన్. అయితే ఎట్టకేలకు పాపం పండింది. 2020 లో పోలీసులు వైన్‌రైట్ కి సంబంధించిన ఖాతా వివరాలపై ఆరా తీయగా అసలు నిజం బయట పడింది.

 

ఈ క్రమంలో జాన్సన్ పై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే గతంలో డామియాన్ జాన్సన్, జాన్ వైన్‌రైట్ జాయింట్ ఖాతా తెరిచారు. ఈ క్రమంలో వైన్‌రైట్ కి వచ్చే పెన్షన్ ఆ ఖాతాలోనే పడేవి. వీటిని వినియోగించుకునేందు వైన్‌రైట్ బతికే ఉన్నట్లు జనాలను, బ్యాంక్ ని నమ్మించాడు జాన్సన్. అందుకే అతను చనిపోయినా రెండేళ్ల పాటు ఫ్రిడ్జ్ లోనే దాచి ఉంచినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఈ నేపథ్యంలో జాన్సన్ ని స్థానిక కోర్టులో హాజరుపర్చగా ఖాతాను వినియోగించుకునే హక్కు జాన్సన్ కి ఉంది. అతడు అర్హుడే అని భావించిన కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. అయితే వైన్‌రైట్ ఎలా మరణించాడు అనేది మాత్రం బయటపడలేదు.

Related Articles

ట్రేండింగ్

Pithapuram: పిఠాపురంలో ఫుల్ సైలెంట్ అయిన ఓటర్లు.. మద్దతు ఏ పార్టీకి అంటే?

Pithapuram:  ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రత్యర్థుల మీద మాటల దాడి చేస్తూ తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు రాజకీయ నాయకులు. ఆ పార్టీ ఈ పార్టీ అనే కాకుండా ప్రతి పార్టీ వారు తమ...
- Advertisement -
- Advertisement -