Devotional: వీటిని వెంటనే మానేయకపోతే.. పేదరికాన్ని ఆహ్వానించినట్లే?

Devotional: సాధారణంగా చాలామంది ఎంత డబ్బు సంపాదించినా కూడా చేతిలో నిలవడం లేదు అని దిగులు చెందుతూ ఉంటారు. మరికొందరు ఎంత డబ్బు సంపాదించినా కూడా డబ్బు చేతులు మిగలకపోగా అనవసరంగా అప్పులు చేయాల్సి వస్తోంది అని బాధపడుతూ ఉంటారు. అయితే మనం పేదరికం అనుభవించడానికి వాస్తు ప్రకారం మాత్రమే కాకుండా మనకున్న కొన్ని చెడు అలవాట్ల వల్ల కూడా కారణం కావచ్చు. అవునండి మీరు విన్నది నిజమే. కొన్ని చెడు అలవాటు మన ఆర్థిక సమస్యలకు దారి తీస్తాయి.

మరి ఎటువంటి అలవాట్లను మానుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామందికి ఉండే ఒక చెడ్డ అలవాటు ఏమిటంటే రోడ్డుపై నడుస్తున్నప్పుడు చెప్పులు ఈడ్చుకుంటూ నడుస్తూ ఉంటారు. కొంతమందికి అది కంపరంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అలా ఈడ్చుకుంటూ నడవడం అనేది ఏ మాత్రం మంచిది కాదు. ఇలాంటి అలవాటు ఉన్నవారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు. అంతేకాకుండా అలా చెప్పులు ఈడ్చుకుంటూ నడిచే వారి వైవాహిక జీవితాలు కూడా సరిగా ఉండవు. కాబట్టి చెప్పులు ఈడ్చే అలవాటు ఉంటే వెంటనే మానుకోవడం మంచిది.

 

సాధారణంగా వంటగదని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని మన ఇంట్లోని వారు చెబుతూ ఉంటారు. కానీ కొంతమంది వంట చేసిన తర్వాత ఎక్కడి వస్తువులు అక్కడే వేసి చల్లా చదివిగా పడేస్తూ ఉంటారు. ఆ విధంగా చేయకూడదు. వంటగది చెల్లాచెదురుగా, మురికగా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు. స్త్రీలతో పాటు పురుషులలో ఉండే అతిపెద్ద చెడ్డ అలవాటు గోర్లు కొరకడం. చాలామంది గోర్లు కోరికడాన్ని టైంపాస్ గా స్టైల్ గా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. కాగా జ్యోతిష్యం ప్రకారం ఇలా గోర్లను నమిలే వారి చేతిలో డబ్బు నిలవదట. ఆర్థిక సమస్యలు కూడా ఎదురవుతాయి. కాబట్టి గోర్లు కొరికే అలవాటు ఉంటే వెంటనే మానేయ్యాలి. చాలామంది రెండు మూడు రోజులైనా స్నానం చేయకుండా అలాగే మురికిగా ఉంటారు. అలా మురికిగా ఉండే ప్రదేశంలో మురికిగా ఉన్న వారికి లక్ష్మీ అనుగ్రహం లభించదు. శుభ్రంగా ఉన్న చోట మాత్రమే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -