Chandrababu Naidu: ఏపీ సీఎం వైఎస్ జగన్ పేరు మార్చిన చంద్రబాబు.. కొత్త పేరు ఏంటో తెలుసా?

Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజాగళం పేరిట ఈయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ అధికార ప్రభుత్వంపై విమర్శలు చేయడమే కాకుండా ఏపీ అభివృద్ధి కొనసాగాలన్న ఏపీ ప్రజల భవిష్యత్తు మారాలన్న తప్పనిసరిగా కూటమి అధికారంలోకి రావాలని ఈయన ప్రజలకు హితబోధ చేస్తున్నారు. ఇక ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు ఇటీవల ఆలూరులో సమావేశంలో పాల్గొన్నారు.

కర్నూలు జిల్లా ఆలూరు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర మార్చే కీలక తరుణమిది. ఏపీ ప్రజల భవిష్యత్‌ను మార్చే ఎన్నికలు ఇవి. ఆలూరు అదరగొట్టింది.. కర్నూలు సై అంటూ కాలు దువ్వింది. వైసీపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు ఇక వచ్చే ఎన్నికలలో ఎన్డీఏ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని తెలిపారు. కేంద్ర సహకారం ఏపీకి ఎంతో అవసరమని బాబు పిలుపునిచ్చారు.

ఆర్థికంగా బలంగా ఉన్నవారికి కాకుండా ఒక సాధారణ వ్యక్తికి కూడా టికెట్ ఇచ్చినటువంటి ఘనత కేవలం తెలుగుదేశానికి మాత్రమే దక్కుతుందని ఈయన తెలిపారు. ఎంపీటీసీగా ఉన్నటువంటి వ్యక్తిని ఎంపిక గెలిపించుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై కూడా విమర్శలు చేశారు.

తాను జగన్మోహన్ రెడ్డి పేరును మారుస్తున్నానని ఇకపై తనని జే.. గన్ రెడ్డిగా నామకరణం చేస్తున్నానని తెలిపారు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టారని తెలిపారు. ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏపీని అప్పుల కుప్పగా మార్చారని తెలిపారు. కనీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చిందని తెలిపారు. ఇక ఈ ఐదేళ్ల కాలంలో ఒక్క ప్రాజెక్టు కూడా సీమకు తీసుకురాలేదని ఈయన జగన్ పై విమర్శలు చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -