Chandrahas: బోల్డ్ సినిమాలే ప్రభాకర్ కొడుకుకు సూట్ అవుతాయా?

Chandrahas:బుల్లితెర మెగాస్టార్ గా పేరొందిన ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. చాలా రోజుల క్రితం చంద్రహాస్ సినిమా ప్రారంభమైంది. దానికి సంబంధించి అప్ డేట్ కూడా ఇచ్చారు. తన తొలి టైటిల్ తో పాటుగా ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేశారు. `బ్లాక్‌ డాగ్‌ ఫర్‌ ఏ వైట్‌ చిక్‌` అనే బోల్డ్ టైటిల్‌తో సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ టైటిల్‌ని ప్రకటించడమే కాకుండా శనివారం ఫస్ట్ గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు. బోల్డ్ కంటెంట్‌తో ఉన్న ఈ ఫస్ట్ గ్లింప్స్ ఇప్పుడు యూట్యూబ్‌ ను షేక్ చేస్తోంది.

 

గ్లింప్స్ లో విదేశీ అమ్మాయితో చంద్రహాస్‌ రొమాన్స్ చేస్తున్నట్లుగా ఉంది. ఇందులో చంద్రహాస్ చెప్పే డైలాగులు బాగా ఆకట్టుకుంటున్నాయి. స్విమ్మింగ్‌ పూల్‌లో బికినీలో ఉన్న ఫారెన్‌ అమ్మాయిని చూసి చంద్రహాస్ టెంప్ట్ అవ్వడం ఆ తర్వాత అమ్మదీనమ్మ ఇంత తెల్లగా ఉందేంట్రా బాబూ అనే డైలాగ్ చెబుతాడు. హాట్‌ యోగాలు చేస్తున్న ఆ అమ్మాయిని చూస్తూ హీటెక్కిపోతాడు. ఆ తర్వాత ఆ అమ్మాయితో తెగ తెచ్చిపోతాడు. చంద్రహాస్ రొమాన్స్ లో మునిగిపోతాడు.

ఆఖరికి మమ్మల్నే బ్లాక్‌ డాగ్‌ అంటావే.. నీ అమ్మ.. బ్లడీ.. `అంటూ ఓ బూతు పదం కూడా చెబుతాడు. ఈ గ్లింప్స్ మొత్తంగా బోల్డ్ టైటిల్ తోనే కాదు ఓవర్ డోస్ తో ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట దుమారం రేపుతోంది. నటుడు, దర్శకుడు అయిన ప్రభాకర్‌ కొడుకు హీరోగా ఎంట్రీ ఇలాంటి సినిమాతో రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 

ఈ మధ్య చంద్రహాస్ స్టైల్, యాటిట్యూడ్ విషయంలో ట్రోల్స్ ఎక్కువయ్యాయి. స్వామి మాలలో ఉండి కూడా ఆయన ఇచ్చిన ఫోజులుతో ట్రోలర్స్ ఆడుకున్నారు. ఇప్పుడు బోల్డ్ కంటెంట్ తో సినిమా చేయడంతో ఈ ట్రోల్స్ మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ గ్లింప్స్ ను చూసి చంద్రహాస్ ను యాటిట్యూడ్ స్టార్ అని నామకరణం కూడా చేసేశారు. దీంతో మరింత మంది ట్రోలర్స్ అటాక్ చేసే అవకాశం ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -