CM Jagan: వాలంటీర్ల నుంచే నాయకులు వస్తారన్న జగన్.. మరి వాలంటీర్లకు జగన్ టికెట్ ఇస్తారా?

CM Jagan: వినాశకాలే విపరీత బుద్ది అని అంటారు. జగన్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు అలాగే ఉన్నాయి. వాలంటీర్లకు ప్రోత్సహకాల పంపిణీ కార్యక్రమంలో జగన్ వాలంటీర్లను ఆకాశానికి ఎత్తేశారు. మీరే రేపటి నాయకులు అని చెప్పుకొచ్చారు. మీరే వైసీపీ సైన్యం అని పొగడ్తల వర్షం కురిపించారు. మీ సేవా భావం రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం అని ప్రశంసించారు. ఇందులో ఏం తప్పుంది అని అంతా అనుకోవచ్చు. కానీ.. రాజకీయంగా, వ్యూహాత్మకంగా జగన్ చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు. వాలంటీర్లను ఎన్నికల్లో వాడుకోవడానికి.. వారిలో ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవడానికి ఇలాంటి కామెంట్స్ చేసిన ఉండొచ్చు కానీ.. చాలా రకాలుగా నష్టం ఉంది.

వాలంటీర్లు సేవాకార్యకర్తలు అంటున్నారు. కానీ, వారికి ప్రజల సొమ్ము పంచేస్తున్నారు. ప్రజల సొమ్ము తీసుకుంటున్నారిని రేపటి లీడర్స్ అని అంటున్నారు. ఒకదానితో ఒకటి పొంతన లేదు. బహిరంగంగా ఇలా పంచిపెడుతున్న అంశంపై ఈసీ కానీ.. కోర్టులు కానీ దృష్టిపెడితే జగన్ కు చిక్కులు తప్పవు.

ఇక మేరే నా సైన్యం.. మీరే రేపటి లీడర్స్ అని అంటున్నారు. నిజంగా వారే నాయకులు అనుకుంటే.. వైసీపీ కార్యకర్తలు ఎందుకు? వైసీపీ నాయకులు ఎందుకు? ఈ ప్రశ్నల ఆ పార్టీ నేతల్లో ఇప్పుడు మొదలైంది. జగన్ వాలంటీర్లకు ఇచ్చిన విలువ, గౌరవం తమకు ఇవ్వడం లేదని ఆ పార్టీ నేతల్లో ఎప్పటి నుంచో ఉంది. పథకాలు, పనులు అన్ని వాలంటీర్ల ద్వారానే జరుగుతుందనే అభిపాయం వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీల్లో పాతుకుపోయింది. ప్రజలు ఏ అవసరానికి కూడా తమ దగ్గరకు రావడం లేదని అసంతృప్తి వారిలో నెలకొంది. ఆ అసంతృప్తికి తోడు వాలంటీర్లను నాయకులుగా చేస్తే తమ పరిస్థితి ఏంటనే ప్రశ్న వారిలో తలెత్తుతోంది. వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి తమ పవర్స్ తీసేశారని.. ఇప్పుడు ఆ వాలంటీర్లను నాయకులుగా చేసి తమ పదవులు కూడా తీసేస్తారా? అని ప్రశ్నలు సర్పంచుల నుంచి వినిపిస్తున్నాయి.

అలా అని జగన్ నిజంగా వాలంటీర్లను నాయకులుగా చేస్తారా అంటే అంతసీన్ అక్కడ లేదు. వాలంటీర్లను నాయకులుగా చెబుతున్నారే తప్ప.. నాయకులుగా చూడటం లేదు. కేవలం సేవకులగా మాత్రమే చూస్తున్నారు. ఓరకంగా చెప్పాలంటే.. సేవకులుగా కూడా కాదు బానిసలుగా చూస్తున్నారు. అందుకే ఐదువేలు ఇచ్చి గొడ్డి చాకిరి చేయించుకుంటున్నారు. కేవలం ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి వాలంటీర్లు కావాలి. దాని కోసమే వారిని నాయకులు అని సంబోధిస్తున్నారు. కానీ, ఆ మాటలు వైసీసీ క్షేత్రస్థాయి నాయకుల్లో ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. ఒకరి మెప్పు పొందడానికి జగన్ చేసిన కామెంట్స్ చాలా మంది ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. అదే కోపంతో క్షేత్రస్థాయి నాయకులు వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తే వారి పరిస్థితి ఏంటీ? ప్రస్తుతం అదే జరుగుతోంది. ఇప్పటికే చాలా మంది టీడీపీ, జనసేనలోకి మారిపోతున్నారు. మరొకొందరు స్తబ్ధుగా ఉన్నారు. సైలంట్ గా వైసీపీకి వ్యతిరేకంగా పని చేస్తూ టీడీపీ గెలిచిన తర్వాత పార్టీలోకి మారాలని ఆలోచిస్తున్నారు. జగన్ చేసిన కామెంట్స్ వైసీపీలోనే విభేదాలకు కారణం అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -