CM Jagan: తల్లిపై ప్రేమను కురిపించిన సీఎం జగన్.. ఏం జరిగిందంటే?

CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మనందరికీ తెలిసిందే. 2019లో ఏపీ సీఎం గా గెలిచిన జగన్ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా జగన్ మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు జగన్. తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో విజయమ్మకు హ్యాపీ బర్త్డే అమ్మ అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తల్లిని ఆప్యాయంగా హత్తుకున్న ఫోటోని జగన్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

అందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వైసీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున విజయమ్మకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరొకవైపు హైదరాబాద్ లో షర్మిల తన నివాసంలో తన తల్లి పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. కేక్ కట్ చేసి తల్లికి తినిపించారు. విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా పలువురు ఇంటికి వెళ్లి ఆమెకు గ్రీటింగ్ కార్డ్స్ ఇవ్వడంతో పాటు పెద్ద ఎత్తైన శుభాకాంక్షలు తెలియజేసినట్టు తెలుస్తోంది. ఇకపోతే సీఎం జగన్ విషయానికి వస్తే వచ్చే ఏడాది రాష్ట్ర ఎన్నికలు జరగనుండగా వచ్చే ఏడాది కూడా తానే అధికారంలోకి మళ్ళీ వస్తాను అన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు జగన్.

తాను జనాన్ని నమ్ముకున్నానని జననం ఎప్పుడు మోసం చేయరు అన్న సిద్ధాంతాన్ని బాగా విశ్వసిస్తున్నారు. మరోవైపు టిడిపి కూడా వచ్చే ఎన్నికలలో తామే గెలుస్తాము అన్న నమ్మకంతో గట్టిగానే కృషి చేస్తున్నారు. ఏపీలో ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉండగానే అప్పుడే రాజకీయాలలో వేడి మొదలయ్యింది. వచ్చే ఎన్నికల గురించి విషయాల గురించి ఇప్పటి నుంచే చర్చించుకోవడం మొదలుపెట్టారు. మరి వచ్చే ఏడాది ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -