Farmers March: మోదీ సర్కార్ మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసిన రైతులు.. ఏమైందంటే?

Farmers March: ప్రతిపక్షాల వ్యూహాలను చిత్తు చేస్తున్న అధికార బీజేపీకి రైతు సంఘాలు సవాల్ విసిరాయి. దీంతో.. అమిత్ షా, మోడీ తలలు పట్టుకుంటున్నారు. 2021లో కేంద్రం తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఢిల్లీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. అయితే.. ప్రభుత్వం వెనక్కి తగ్గడంతో రైతులు ఆందోళనలు విరమించారు. అప్పుడే రైతులు ప్రభుత్వం ముందుంచి పలు డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చింది. కానీ, ఇంత వరకూ అవి అమలు కాలేదు. దీంతో.. మరోసారి రైతులు ఆందోళన బాటపట్టారు. గతంలో ఇచ్చి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. యూపీ, పంజాబ్, హర్యనాతో పాటు పలు రాష్ట్రాల నుంచి రైతులు ఢిల్లీకి చేరుకుంటున్నారు. అటు.. కర్నాటక, కేరళ నుంచి కూడా రైతులు ఢిల్లీకి చేరుకోనున్నారు. ఇప్పటికే పంజాబా, హర్యానా నుంచి పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నారు.

రైతులను అడ్డుకోవడానికి ఎక్కడిక్కడ భద్రతా బలగాలు మొహరించాయి. దేశ రాజధాని ఢిల్లీలో నెల రోజుల పాటు 144 సెక్షన్ విధించారు. ఢిల్లీలోకి ట్రాక్టర్లు, పేలుడు పదార్థాలు, పెట్రోల్, డీజిల్ లాంటివి అనుమతించేదే లేదని పోలీసులు తెలిపారు. ఎక్కడికక్కడ రైతులను అడ్డుకోవడానికి రోడ్లపై తాత్కాలికంగా కాంక్రీట్ గోడలు నిర్మింస్తున్నారు. ఇక పంజాబ్ నుంచి పెద్ద ఎత్తున వస్తున్న రైతులపై హర్యానా సరిహద్దుల్లోని శంభు ప్రాంతంలో పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. దీంతో.. రైతులు చెల్లా చెదురుగా పరుగులు తీశారు.

భాస్పవాయువు ప్రయోగించడంపై భారతీయ కిసాన్ యూనియన్ చీఫ్ రాకేశ్ టికాయత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నిరసనలను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఊరుబోమని హెచ్చరించారు. దేశంలో వందల సంఖ్యలో రైతులు సంఘాలు ఉన్నాయని.. ఒక్కో సంఘానికి ఒక్కో సమస్య ఉందని వారు టికాయత్ చెప్పారు. వారి సమస్యలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. వారిని ఇబ్బందులకు గురి చేస్తే తాము ఉద్యమిస్తాని హెచ్చరించారు.

ఈసారి రైతుల తమ డిమాండ్ల నెరవేర్చే వరకూ వెనక్కి తగ్గేలా లేరు. ఆరు నెలలకు సరిపడా సామగ్రిని ట్రాక్టర్లలో వేసుకొని రైతులు ఢిల్లీకి చేరుకుంటున్నారు. పంజాబ్ నుంచి వందల ట్రాక్టర్లలో రైతులు ఢిల్లీ వైపు వస్తున్నారు. ప్రభుత్వం, పోలీసులు తమ అసహనాన్ని పరీక్షించలేరని రైతులు చెబుతున్నారు. ఆరు నెలలకు సరిపడా సామగ్రితో ఉద్యమబాట పట్టామని తెలిపారు. డిమాండ్లు నెరవేర్చుకోవడమే తమ లక్ష్యమని తేల్చి చెబుతున్నారు. దాని కోసం ఎంతవరకైనా వెళ్తామని అంటున్నారు. రైతులు ఆందోళనలను చూస్తున్న కేంద్ర పెద్దలకు టెన్షన్ మొదలైంది. కనీస మద్దతు ధరపై పరిశీలన చేస్తున్నామని చెబుతున్నారు కానీ.. అమలు చేస్తామని గట్టిగా చెప్పలేకపోతున్నారు. గతసారి నిరసనలు చేపట్టినపుడు పెట్టిన కేసులను రైతులపై తొలగించడానికి కేంద్రం సిద్దంగా ఉంది. 2021లో ఆందోళనలో మృతి చెందిన రైతులకు పరిహారం చెల్లించడానికి కూడా ఓకే చెబుతోంది. కానీ, కనీస మద్దతు ధర విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వలేకపోతోంది. అయితే, రైతుల ప్రధాన డిమాండ్ గా కనీస మద్దతు ధరే ఉంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -