PM Kisan: రైతులకు మోదీ సర్కార్ తీపికబురు ఇదే.. ఆరోజే రైతుల ఖాతాల్లో నగదు జమ కానుందా?

PM Kisan: రైతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభవార్తను తెలియజేశారు. రైతులకు ఆదాయ వనరుగా వారి వ్యవసాయ పనులలో సాయం అందిస్తూ రైతులకు అందిస్తున్నటువంటి పీఎం కిసాన్ సంబంధించిన ప్రతి ఏడాది రైతుల ఖాతాలు స్వయంగా జమ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా 2000 రూపాయలు చొప్పున 3 విడుదలలో ఈ 6000 రూపాయలను రైతుల ఖాతాలో వేస్తున్నారు.

ఇప్పటివరకు 15 విడుదలగా పీఎం కిసాన్ యోజన డబ్బులను ప్రధానమంత్రి జమ చేయగా 16వ విడత డబ్బులను రైతుల ఖాతాలో జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇక 16వ పీయం కిసాన్ సమాధి యోజన పథకం కింద రెండు వేల రూపాయలను ఫిబ్రవరి 28 2024న విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు.

ఇలా అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రెండు వేల రూపాయల నగదు జమ కానుంది అయితే పొలం ఉండి అర్హత కలిగి డబ్బులు రానివారు సమీప మీసేవ కేంద్రానికి వెళ్లి లేదా https://pmkisan.gov.in/ Portal ద్వారా సమస్యను తెలుసుకోవచ్చు ఇక మీకు పీఎం కిసాన్ సేవ నిధి డబ్బు జమ అయిందా లేదా అనే విషయాలను కూడా ఇదే అధికారిక వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

ఈ విధంగా రైతులకు చేదోడుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పథకాన్ని అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఎన్నో లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఇక ఈ పథకం విషయంలో రైతులకు ఏ విధమైనటువంటి సందేహాలు ఉన్న సలహాల కోసం అధికారక వెబ్సైట్ సంప్రదించి లేదా దగ్గర్లోని మీసేవ కేంద్రానికి వెళ్తే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -