PM Modi: కాంగ్రెస్ వస్తే సంపదంతా ముస్లింలకే.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు వైరల్!

PM Modi: మరికొద్ది రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో అన్ని రాష్ట్రాలలోనూ అలాగే కేంద్రంలో కూడా ఏ ప్రభుత్వం వస్తుందన్న ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలు దశలవారీగా జరుగుతున్న సంగతి తెలిసిందే. మే 13వ తేదీ రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఈసారి ఎలాగైనా కూడా కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావాలని నరేంద్ర మోడీ భావిస్తున్నారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా మెల్లమెల్లగా పుంజుకుంటుంది దక్షిణాది రాష్ట్రాలలో ఇప్పటికే తెలంగాణతో పాటు కర్ణాటకలో కూడా అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ అధికారం చేపట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మోడీ సైతం పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈసారి కూడా అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఈయన ఇటీవల రాజస్థాన్ లో పర్యటించారు.

రాజస్థాన్ లోని పలు ప్రాంతాలలో పర్యటించినటువంటి నరేంద్ర మోడీ కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే సంపద మొత్తం మైనార్టీలకే పంచి పెడతారు అంటూ ఈయన ఆరోపణలు చేశారు. దేశంలోని సంపదపై తొలి హక్కు మైనారిటీలదేనని గతంలో మన్మోహన్ సింగ్ చెప్పిన విషయాలను గుర్తు చేశారు. దేశంలో ప్రజల వద్ద బంగారంతో సహా ఉన్నటువంటి సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా పంచుతామంటూ కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పెట్టారని మోడీ గుర్తు చేశారు ఇలా కాంగ్రెస్ పట్ల మైనారిటీల పట్ల ఈయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -