YS Sharmila Slams Modi: అప్పుడు జగన్.. ఇప్పుడు మోదీ.. షర్మిల మామూలుగా టార్గెట్ చేయడం లేదుగా

YS Sharmila Slams Modi: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో షర్మిల తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా బాపట్ల పార్లమెంటు పరిధిలో పర్యటించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనపై విరుచుకుపడ్డారు. గోద్రా అల్లర్ల గురించి ప్రస్తావించారు. బాపట్లలోని కాంగ్రెస్ అభ్యర్థి జేడీ శీలం తరఫున ప్రచారం ప్రచారం చేశారు షర్మిల. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులను ముస్లింలకు పంచుతుందని దీంతో హిందువుల మంగళ సూత్రాలు కూడా మిగలవని నరేంద్ర మోడీ ప్రస్తావించారు.

నిజానికి మోడీ హయాంలో గుజరాత్ మహిళల మంగళసూత్రాలు ఎన్ని తెగిపడ్డాయో ఆయనకి గుర్తులేదా? మమ్మల్ని చెప్పమంటారా అంటూ ప్రశ్నించారు. గోద్రా అల్లర్ల ఘటనలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, వారి ఇళ్లల్లో మహిళల మంగళ సూత్రాలు తెగలేదా అంటూ నిలదీశారు. మతాల మధ్య చిచ్చు పెట్టి మంగళ సూత్రాలు తెరిచే పథకాన్ని ఆయనే తెస్తున్నారని మోడీపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు షర్మిల.

కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ విషం చిమ్ముతున్నారని, మోడీ ఆడవాళ్ళ మంగళసూత్రాలు గురించి మాట్లాడటం సరికాదు అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రేమ నింపేలా వ్యవహరిస్తున్నారని, ప్రధాని మోదీ మాత్రం మతాలను విడదీసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ దమ్ముంటే చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోవాలని సవాల్ విసిరారు.

ముస్లింలను కించపరిచేలా మాట్లాడటం సరికాదని సూచించారు. ఇది బీజేపీ కి ఈ దేశానికి కూడా మంచిది కాదని హితవు పలికారు. బాపట్లలో నల్లమాడ వాగు ప్రతి ఏటా పొంగి పోవడం వలన లక్షల ఎకరాల్లో పంట నష్టం జరుగుతుంది. ఆ వాగు ని ఆధునికరించాలని వైయస్సార్ అప్పట్లో అనుకునేవారు అయితే ఆయన వారసుడిగా ఉన్న జగన్ ఇప్పుడు ఆ వాగు సంగతే పట్టించుకోవడం లేదు అంటూ అటు మోడీని ఇటు జగన్ పై కూడా ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు షర్మిల.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -