Devotional: నెమలి ఈకను ఆ దిశలో పెడితే చాలు.. కాసుల వర్షమే?

Devotional: నెమలి, నెమలి ఈకలను చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడుతుంటారు. అయితే చాలామంది నెమలి ఈకలను ఇంట్లో అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. అయితే నెమలి ఈకలు ఇంటికి అందాన్ని తేవడంతో పాటుగా ఇంట్లో సానుకూల శక్తిని కూడా తెస్తాయి. అంతే కాకుండా ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి, సంపద శ్రేయస్సును పెంచడానికి కూడా నెమలి ఈకలు ఎంతో బాగా ఉపయోగపడతాయి. మరి నెమలి ఈకను ఎటువంటి దిశలో ఉంచుకోవాలి? వాటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఎటువంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

 

ఇంట్లో నెమలి ఈకలు పెడితే సంపదలకు అధిదేవత అయిన లక్ష్మి, దేవి, సరస్వతి ఇద్దరూ ఇద్దరు ఇంట్లో కొలువై ఉంటారు. నెమలి ఈకలను వేణువుతో ఇంట్లో ఉంచుకుంటే సంబంధంలో ప్రేమ పెరుగుతుంది. అలాగే వైవాహిక జీవితంలో టెన్షన్ ఉంటే అటువంటప్పుడు పడకగదిలో నెమలి ఈకలను పెట్టుకోవడం వల్ల భార్యాభర్తల జీవితంలో ప్రేమ పెరిగి బంధం బలపడుతుంది. అలాగే గ్రహాల అశుభ ప్రభావాలను తొలగించాలనుకుంటే ఆ గ్రహం మంత్రాన్ని 21 సార్లు జపించి, నెమలి ఈకపై నీటిని చల్లి మంచి ప్రదేశంలో అందరికీ కనిపించే చోట పెట్టాలి. ఆ విధంగా చేయడం వల్ల గ్రహాల అశుభాలు అంతమవుతాయి.

 

అదేవిధంగా మీరు మీ బిడ్డను చెడుదృష్టి నుండి రక్షించాలనుకుంటే, అప్పుడు నెమలి ఈకలను వెండి రక్షలో ధరించాలి. ఇకపోతే నెమలి ఈకలను ఏ దిక్కున పెట్టాలి అన్న విషయానికి వస్తే..వాస్తు శాస్త్రం ప్రకారం మీరు ఇంటి దక్షిణ దిశలో ఉన్న ఖజానాలో నెమలి ఈకలను ఉంచినట్లయితే, డబ్బుకు ఎటువంటి కొరత ఉండదు. అలాగే ఇంట్లో తూర్పు, వాయువ్య దిశలో నెమలి ఈకలను ఉంచాలి.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -