Peacock Feather: నెమలి పించం ఇంట్లో ఉంటే ఆ దోషాలన్నీ పరార్?

Peacock Feather: నెమలి.. ఈ పక్షిని చూసినప్పుడు చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లలు అయిపోతూ ఉంటారు. ఆ పక్షిని చూసి ఎంతో ఆనందపడుతూ, మురిసిపోతూ ఉంటారు. అంతేకాకుండా నెమలి పురివిప్పి నాట్యం చేస్తే ఆ దృశ్యాన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవు. కాగా హిందూ సంప్రదాయ ప్రకారం నెమలీ ఈకలను ఎంతో పవిత్రంగా కూడా భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ నెమలిని చంపడం అన్నది చట్టరీత్యా నేరం. అందుకు తగిన జరిమానా తో పాటు జైలు శిక్ష కూడా అనుభవించాల్సిందే.

అయితే చాలామంది నెమలి ఈకలను పవిత్రంగా భావిస్తూ పూజ మందిరంలో ఉంచి మరి పూజ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ నెమలి ఈకలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మరి నెమలి పించం పెట్టుకోవడం వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..చదువుల్లో వెనుక బడి ఉండే విద్యార్థులు ఈ నెమలి పించాలను పుస్తకాల్లో పెట్టుకుంటే చదువులో బాగా రాణిస్తారట. అలాగే ఇంట్లో ఉన్న వినాయకుడి విగ్రహం లేదా ఫోటో దగ్గర నెమలి పింఛాన్ని ఉంచితే వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా రాత్రి పూట నిద్రించేటప్పుడు దిండు కింద నెమలి పింఛాన్ని పెట్టుకొని పడుకోవడం వల్ల ఆర్ధిక, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి.

 

అలాగే పీడకలలు కూడా రాకుండా ఉంటాయి. గ్రహ సమస్యలు కానీ దోషాలతో కానీ ఇబ్బంది పడే వారు నెమలి పించం పై నీరు కొద్దీ కొద్దిగా పోస్టు 21 సార్లు ఆ గ్రహానికి చెందిన మంత్రాలను చదివి ఆ నెమలి పింఛాన్ని పూజగదిలో పెట్టి మరునాడు నీటిలో ముంచాలి. ఇలా చేస్తే గ్రహ దోషాలు తొలిగిపోతాయి. అదేవిధంగా ఇంట్లో బెడ్ రూమ్ లో తూర్పు లేదంటే ఈశాన్యం మూలలో నెమలి పించం పెట్టుకోవడం వల్ల ఎప్పటి నుండో ఉన్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -