AP Volunteers: వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలే.. వైసీపీకి కొత్త శత్రువులు అవసరమే లేదుగా!

AP Volunteers: శత్రువులు ఎక్కడో ఉండరు.. మన ఇంట్లోనే కూతరు రూపంలోనో.. చెల్లెలు రూపంలో మన చుట్టూనే తిరుగుతారని ఓ సినిమాలో రావు రమేష్ అంటాడు. అక్కడ హీరోయిన్ గురించి చెప్పాల్సి వచ్చింది కనుక కూతురు, చెల్లి అని అంటారు. కానీ, మన అనుకునే వాళ్లు మనకు శత్రువు, ప్రత్యేకించి ఎవరో మనకు నష్టం చేయాల్సిన పని లేదు. ఏపీలో కూడా వైసీపీ బయట శత్రువుల కంటే.. పార్టీలో శత్రువులే ఎక్కువగా ఉన్నారు.

వాలంటీర్ల విషయం మొదటి నుంచి వివాదాస్పదం అవుతోంది. వాలంటీర్లు వైసీపీకి కార్యకర్తకల్లా పని చేస్తున్నారనే అభిప్రాయం ఉంది. బయటవాళ్లే కాదు..పార్టీలో కూడా చాలా మంది కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించుకున్నామని.. వాలంటీర్లు కూడా వైసీపీ కార్యకర్తలే అని మంత్ర అంబటి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి లాంటి వారు పలు సార్లు అన్నారు. దీని వలన వైసీపీ ఎంత డ్యామేజ్ జరగాలో అంతా జరిగింది. అయితే, గతంలో అనడం వేరు. ఎన్నికల టైంలో అనడం వేరు. ఈ టైంలో ఏం మాట్లాడినా.. అది పెద్ద రచ్చ అవుతుంది.

వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాద్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సంచలనం మాత్రమే కాదు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళంలో ఓ కార్యక్రమంలో వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలేనని చెప్పుకొచ్చారు. వాలంటీర్లతో సరిగా పని చేయించుకోవాలని నాయకులకు సూచించారు. అంతేకాదు.. ఎన్నికలు వచ్చినపుడే నాయకులు ప్రజల్లో ఉంటారని.. కానీ, వాలంటీర్లు నిత్యం ఉంటారని గుర్తు చేశారు. అందుకే వారిని సరిగా వినియోగించుకుంటే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. ఈసీ నిబందనలు అడ్డు వస్తే.. వాళ్లతో రాజీనామా చేయించాలని సూచించారు. ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఏం చేయాలో ఆలోచిద్దామని తెలిపారు. దర్మాన చేసిన కామెంట్స్ ఈసీ నిబందలను ఉల్లంఘించినట్టే. ఓ వైపు వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తున్నారని.. వైసీపీతో వారికి సంబంధం లేదని కోర్టులకు, ఈసీకి చెబుతుంటే.. ఎన్నికల టైంలో ధర్మాన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. అయితే, ధర్మాన స్టైలే వివాదాస్పదం అన్నట్టు మారింది. వివాదాస్పదం అనే కంటే సొంత పార్టీని ఇబ్బంది పెట్టేలా ఉంటాయి. కావాలనే అంటారో.. అవగాహన లేక అంటారో తెలియదు కానీ.. చాలా సార్లు వైసీపీకి చేటు చేసే కామెంట్స్ చేశారు.

నెల రోజుల క్రితం ధర్మాన చేసిన కామెంట్స్ కూడా పార్టీకి ఇబ్బందిగా మారాయి. త్వరలో యుద్దానికి రెడీ అవుతున్నాం కానీ.. చాలా మంది మన పార్టీ గుర్తు తెలియదని అన్నారు. ఈ మాట విన్న వైసీపీ నేతలంతా ఇదెక్కడి మాస్ రా మామా అని అనుకుంటున్నారు. ఓటర్లను ఏ పార్టీకి ఓటు వేస్తారని అడిగితే.. చాలా మంది బాబుకే అని అంటున్నారని చెప్పారు. ఏ బాబుకి అని మళ్లీ అడిగితే.. హస్తం అని కొంత మంది, సైకిల్ అని మరికొంత మంది అంటున్నారని చెప్పారు.

రెండు నెలల క్రితం ఏపీలో మగాళ్లు టీడీపీకే ఓటు వేస్తారని అన్నారు. ఆ మగాళ్లు తమ ఇంట్లో మహిళలను కూడా టీడీపీకి ఓటు వేయాలని కోరుతారు కానీ.. మహిళలు ఎవరూ ఆ మాటలు వినొద్దని చెప్పారు. దానికి కారణం కూడా చెప్పారు. వైసీపీ అన్ని పథకాల డబ్బును కూడా మహిళల ఖాతాల్లోనే వేస్తుంది కనుక మగాళ్లకు ప్రభుత్వంపై కోపం ఉందని చెప్పారు. ఆసరా, అమ్మఒడి ఇలా ప్రతీ పథకం డబ్బు కూడా మహిళల ఖాతాల్లో పడటమే మగాళ్ల కోపానికి కారణమని అన్నారు.

అదే సమయంలో ఏకంగా వైవీ సుబ్బారెడ్డికే ఆయన వార్నింగ్ ఇచ్చారు. ప్రశాంతంగా ఉన్న శ్రీకాకుళం రౌడీల చేతిలోకి వెళ్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కడప నుంచి ఎవడో సుబ్బారెడ్డి వచ్చి భూమి దొబ్బేస్తామని అన్నాడని… నువ్వు ఎవడివి? శ్రీకాకుళం నీ అబ్బసొత్తు కాదని తాను చెప్పానని బహిరంగంగానే అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నాయని… వాటిని కొట్టేసేందుకు రౌడీ మూకలు ఇక్కడకు వస్తున్నాయని ధర్మాన తెలిపారు. వారు ఏ పార్టీకి చెందిన వారైనా తాను అడ్డుకుంటానని చెప్పారు. మరోవైపు ఏపీలో రోడ్లపై కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు. రోడ్లు బాగోలేవని వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయడం మానేయొద్దని ఓటర్లకు చూసించారు. రోడ్ల వల్ల జీవన ప్రమాణాలు పెరుగుతాయా? అని ఆయన ప్రశ్నించారు. రోడ్లు బాలేవని ఆయన చెప్పకనే చెబుతున్నారు. అంతేకాకుండా.. రోడ్లు వేస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Varun Tej: ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం.. వరుణ్ తేజ్ కామెంట్లతో ఫ్యాన్స్ ను ఫిదా చేశారా?

Varun Tej: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ప్రజలే కుటుంబ సభ్యులని, అప్పులు చేసి మరీ కౌలు రైతులకు సాయం చేస్తున్నారని సినీ నటుడు వరుణ్ తేజ్ అన్నారు. పవన్ కళ్యాణ్...
- Advertisement -
- Advertisement -